28.7 C
Hyderabad
May 6, 2024 09: 51 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ వచ్చాక గిరిజనుల ఆత్మగౌరవం పెరిగింది

#SatyavatiRathod

గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ కు అపార గౌరవం ఉందని రాష్ట్ర గిటిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనుల ఆత్మగౌరవం పెరిగిందని తెలిపారు.

అడగకుండానే తమకు కావాల్సిన పనులను చేసిపెట్టే గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కోటి 54 లక్షలతో నిర్మించిన కేజీవిబి పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు 5 కోట్ల వ్యయంతో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో చేపట్టే అదనపు వసతుల పనులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేసారు.

ఈ సందర్బంగా విద్యార్థులు ఆమెకు ఘానా స్వాగతం పలికారు. పూలు చల్లుతూ అభిమానం చాటారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూశాయన్నారు.

తాము అడిగిన ఏ కోరికలు ప్రభుత్వాలు తీర్చలేదని తెలిపారు. తాండాలకు స్వయంప్రతిపత్తి కావాలని రాష్ట్రంలోని 3 వేల తండాలను సీఎం కేసీఆర్ పంచాయతీలుగా మార్చారన్నారు. తాను చదువుకునే రోజుల్లో మూడున్నర కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళేదాన్నని, అక్కడ ముక్కిన బియ్యం, పురుగుల అన్నం తినలేక పారిపోయి వచ్చానని గుర్తు చేసుకున్నారు.

ఇలాంటి పరిస్థితి పోవాలని గత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని గురుకులాలు ఉన్నాయో అంతకు నాలుగింతలు గురుకులాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. గిరిజనులకు ఉన్నత చదువుల కోసం ఒకే రోజు 22 రెసిడెన్షియల్ గురుకులాలు మంజూరు చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

గతంలో విదేశాల్లో చదువుకోవడానికి 10 లక్షల సహాయం ఉంటే అంబెడ్కర్ ఓవర్సీస్ ద్వారా 20 లక్షలకు పెంచారన్నారు. ఎన్.టి రామారావు 19 ఏళ్ల వయసులోనే తనకు జనరల్ కేటగిరీలో ఎమ్మెల్యేగా పోటీ చేసేలా అవకాశం కల్పించారన్నారని చెప్పారు. 

గిరిజన మహిళల పట్ల సీఎం కేసీఆర్ కు ఎంత గౌరవం ఉంటుందో చెప్పడానికి తానే ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీటీసీలు, ఎంపిలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు

Related posts

అక్రమ అరెస్టుపై నిరసనలు చేస్తే హత్యాయత్నం కేసులా?

Satyam NEWS

కర్మణ్యేవాధీకారస్య: ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ లా జగన్ పాలన

Satyam NEWS

బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందించిన మైనంపల్లి

Satyam NEWS

Leave a Comment