39.2 C
Hyderabad
April 30, 2024 20: 04 PM
Slider తూర్పుగోదావరి

అక్రమ అరెస్టుపై నిరసనలు చేస్తే హత్యాయత్నం కేసులా?

#narabhuvaneswari

స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు గానీ….ఇప్పటికీ ఒక్క ఆధారమూ చూపించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రూ.371కోట్లు దారిమళ్లించారని చెప్తున్నారని,  కానీ అ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్లాయో నిరూపించడం లేదన్నారు. ఏ కేసులో అయినా ఆధారం చూపి అరెస్టు చేస్తారని..కానీ స్కిల్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టు చేసి….ఇప్పుడు డబ్బులు ఎక్కడి వెళ్లాయని విచారిస్తున్నారని అన్నారు. ఇలాంటి విచిత్రాన్ని ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం, సీతానగరంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్షలో భువనేశ్వరి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ‘‘చంద్రబాబు ప్రజల సొమ్మేమీ దోచుకోలేదు..అయినా జైల్లో నిర్బంధించారు. ఆయన కోసం మీరందరూ పోరాటానికి వచ్చారు. ప్రజల మనిషిని జైల్లో వేసి 19 రోజులైంది.. ఏం తప్పు చేశారో ఒక్కటన్నా నిరూపించారా? చంద్రబాబు వేసిన ప్రశ్నలకు సీఐడీనే సమాధానం చెప్పలేకపోయింది.

45ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుపై ఎన్నోకేసులు పెట్టారు, ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా? సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి ప్రజల కోసమే చంద్రబాబు పని చేశారు. ఆయన ఊపిరి, ఆలోచనలో ఉంది ప్రజలే. ప్రజలకు ఏం చేస్తే  మంచి జరుగుతుందో, రాష్ట్రం  ఎలా అభివృద్ధి చేయాలి అని నిత్యం ఆలోచిస్తారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకొద్దామా అని ఆలోచిస్తారు.

స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ల ద్వారా 2 లక్షల మందికిపైగా యువతకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొంది లక్షల్లో జీతాలు తీసుకుంటూ కొందరు సీఈఓ స్థాయికి ఎదిగారు.

పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టారు..ఇప్పటికీ ఒక్క కేసు కూడా నిరూపించలేదు. ప్రజలు..ప్రజలు అని అంటూ ఆయన కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. ప్రజల గురించే ఆయన ఆలోచిస్తుంటారు.

బీఏ చదివిన నాకు హెరిటేజ్ కంపెనీ అప్పగించారు..3 నెలల్లోనే పరిశ్రమను నడిపించే స్థాయికి వెళ్లాను. ఎప్పుడూ బయటకు రాని మహిళలు చంద్రబాబుకు మద్ధతుగా వస్తున్నారు..గర్వంగా ఉంది. తమకు అండగా చంద్రబాబు ఉన్నారన్న నమ్మకం మహిళల్లో ఉంది.

సీఎంగా ఉన్న సమయంలో పలుసార్లు చంద్రబాబుతో ప్రోటోకాల్ కార్యక్రమాలకు వెళ్లేదాన్ని..రోడ్లపై చిన్నపాటి గుంతలు ఉన్నా వెంటనే అక్కడి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవారు.

తాను వెళుతున్న దారిలో వీథి లైట్లు సరిగా లేకపోయినా అధికారులకు అప్పటికప్పుడు ఫోన్ చేసి ప్రశ్నించేవారు. వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా అని యాప్ ద్వారా రోజూ పరిశీలించేవారు. ఎక్కడ బల్బు వెలగకపోయినా ఎందుకు వెలగడంలేదని అధికారులను నిలదీసేవారు. అంత బాధ్యతగా ఉండే మనిషిని జైల్లో పెడితే ఏం సంతోషం వస్తుందో వారికే తెలియాలి.

టీడీపీ  కార్యకర్తలు చంద్రబాబు బిడ్డల్లాంటి వాళ్లు. కుటుంబ పెద్దను హింసించి జైల్లో పెడితే బిడ్డలు ఊరుకుంటారా.? నిరసనలు తెలిపితే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. శాంతియుతంగా జరిగే నిరసనలపై పోలీసులు దాడులు చేస్తూ మహిళలను కూడా వ్యానుల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదా?

నేను కూడా ఒక స్త్రీనే….ఈ ఘటనలు నేను మర్చిపోను. నాపైనా రకరకాల మాటలతో దాడి చేశారు..అయినా భయపడలేదు. పనిలేని వాళ్లు ఏమైనా అంటారు..అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

సృష్టికి ఆడదే మూలమన్న విషయం వారు మర్చిపోతున్నారు. అన్ని వర్గాల వారు వచ్చి చంద్రబాబుకు మద్ధతు  తెలుపుతున్నారు..మీ పోరాటానన్ని మేము మర్చిపోలేము.

యువత భవిష్యత్తు కోసం యువగళంను లోకేష్ ప్రారంభించారు. లోకేష్ ను మాట్లాడనివ్వకుండా ఈ ప్రభుత్వం మైక్ లు, సౌండ్ వాహనాలు, నిలబడేందుకు తెచ్చుకున్న కుర్చీ కూడా ఎత్తుకెళ్లింది. ఎన్ని అడ్డుంకులు సృష్టించినా  యువగళం పాదయాత్ర ఆగదు.

చేయీ, చేయీ కలిపి చంద్రబాబుకు మద్ధతుగా ఉందాం. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మీకి 70 ఏళ్లు..అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ కేసులో ఏమైనా అర్థం ఉందా? ఆమె హత్య చేస్తారా.?

కుప్పంలో కూడా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, పోలీసులకు వారి విధులు తెలియవా…. ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తున్నారు. రాష్ట్రం, మీ జీవితాల గురించి, భవిష్యత్ గురించి ఆలోచించండి. భయపడకుండా అందరూ ముందుకొచ్చి ఓటేయాలి..ధైర్యంతో మీరంతా ముందుకు సాగితే ప్రభుత్వం ఏమీ చేయలేదు.

సేవ్ ఆంధ్రప్రదేశ్….సేవ్ డెమెక్రసీ..సత్యమేవ జయతే’’ అని భువనేశ్వరి నినదించారు.

Related posts

ఇమ్మానియేల్ చర్చ్ లో ఘనంగా యేసు పునరుత్థాన పండుగ

Satyam NEWS

నడిరోడ్డుపై నాగుపాము… నిలిచిపోయిన ట్రాఫిక్

Bhavani

రాజంపేటలో కిరాణా షాపు పై విజిలెన్సు దాడులు

Satyam NEWS

Leave a Comment