31.7 C
Hyderabad
May 6, 2024 23: 42 PM
Slider విజయనగరం

సోషల్ మీడియాకు అలవాటు పడొద్దు..!

#pol

జిల్లా ఎస్పీ  ఎం.దీపిక ఆదేశాలతో విజయనగరంలో అపెక్స్ జూనియర్ కళాశాల విద్యార్థులతో మమేకమయ్యారు.. విజయనగరం వన్ టౌన్ పోలీసులు. సైబరు మోసాలు, సోషల్ మీడియా వలన కలిగే అనర్థాల పట్ల వన్ టౌన్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ డా.బి.వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు, సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

విద్యార్థులు తమ చదువుల పట్ల శ్రద్ద పెట్టాలని, ఉన్నాయా లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధనకు కృషి చేయాలన్నారు. ఇంటర్నెట్ ను విజ్ఞానం పెంచుకొనేందుకు ఉపయోగించు కావాలన్నారు. అలా కాకుండా కాలక్షేపం, బెట్టింగులు, గేమ్స్ కు వాడడం వలన చదువు పట్ల ఆసక్తి తగ్గుతుందన్నారు. కావున, సోషల్ మీడియాకు దూరంగా ఉండి, శ్రద్ధగా చదువుకొని లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులతో పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

 సైబరు మోసాలకు, వేధింపులకు గురైతే 1930కు ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ గణేష్, అపెక్స్ ప్రిన్సిపాల్ నిజాముద్దీన్, వన్ టౌన్ పోలీసులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఎవేర్ నెస్: గ్రామీణులకు కరోనా మాస్కుల పంపిణీ

Satyam NEWS

కాంట్ హెల్ప్:నౌకలోని భారతీయులను విడిపించలేం

Satyam NEWS

ప్రమాదకరంగా మారిన డ్రైనేజి మూతలు

Bhavani

Leave a Comment