29.7 C
Hyderabad
May 14, 2024 01: 34 AM
Slider నల్గొండ

కనకంబొట్ల వేంకటేశ్వర శర్మ కు ఘన నివాళులు

#kanakambotlavenkateswarasharma

తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి మాజీ అధ్యక్షుడు కీర్తిశేషులు కనకంబొట్ల వెంకటేశ్వర శర్మ  ప్రధమ వర్ధంతి ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నేరేడుచర్ల పట్టణం లోని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్,అర్చక సంఘం ఆధ్వర్యంలో దివంగత వెంకటేశ్వర శర్మ కు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అర్చక సంఘానికి వేంకటేశ్వర శర్మ ఎనలేని సేవలను చేశారని పలువురు బ్రాహ్మణ సంఘం నేతలు గుర్తు చేసుకొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్ర సతీష్ శర్మ,వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంబొట్ల ఫణి కుమార్ శర్మ, సూర్యాపేట జిల్లా కన్వీనర్ రాయప్రోలు శ్రీ రామయ్య శర్మ,ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇరువంటి శ్రీనివాస శాస్త్రి,మండల అధ్యక్షుడు హరి సురేష్ కుమార్ శర్మ, ఉపాధ్యక్షుడు ఇరువంటి శ్రీపాద శర్మ, స్థానిక బ్రాహ్మణ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వాట్సాప్ ద్వారా నీట్,జేఈఈ గ్రాండ్ టెస్ట్స్

Satyam NEWS

ముస్లింలకు నవతరం పార్టీ రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS

పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి

Satyam NEWS

Leave a Comment