26.7 C
Hyderabad
May 3, 2024 07: 29 AM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టాలి

#kollapurmla

తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ గ్రామ గ్రామానా నిరసన తెల్పాలని కొల్లాపూర్ మండలం అధ్యక్షుడు ముచ్చర్ల రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కొల్లాపూర్ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు  రైతులకు మద్దతుగా గ్రామ, మండల, పట్టణ ముఖ్య కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.

రాష్ట్ర రైతులు పండించే ధాన్యం కొనబోమని ప్రకటించిన  కేంద్ర ప్రభుత్వ వైఖరి కి నిరసనగా కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు నిర‌స‌న‌లు చేప‌ట్టాలని, కేంద్ర వైఖ‌రిని నిల‌దీస్తూ, రైతులకు అండగా నిలబడాలని పార్టీ శ్రేణులను MLA కోరారు. కార్య‌క్ర‌మాల్లో భాగంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వ  దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్దం చేయాలన్నారు.

యాసంగిలో పండే పంటను కొనమని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో, టిఆర్ఎస్ రైతుల పక్షాన ఉంటూ పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికే పార్లమెంటు లో ఎంపీ లు కేంద్రాన్ని ప్రశ్నించారని, మంత్రుల బృందం సైతం ఢిల్లీలో పర్యటించి,తెలంగాణ రైతుల గోసను వినిపించే ప్రయత్నం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారితో పాటుగా  ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్  ఎంపీటీసీ మునిసిపల్ చైర్మన్లు,కౌన్సిలర్లు,వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాలు,రైతు బంధు సమితులు,సొసైటీ పాలక వర్గాలు,గ్రామ స్థాయి నుండి మండల, మునిసిపల్, కార్పొరేషన్, గ్రేటర్ డివిజన్ ల స్థాయి వరకు పార్టీ అధ్యక్షులు, కార్యవర్గాలు,అనుబంధ కమిటీల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Related posts

సురక్షితమైన సమాజం లక్ష్యంగా సిసి కెమెరాల ఏర్పాటు

Satyam NEWS

ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణలో భద్రాద్రి కొత్తగూడెం ముందడుగు

Satyam NEWS

పరీక్షల్లో మళ్లీ పాత తప్పులు జరగనివ్వద్దు

Satyam NEWS

Leave a Comment