40.2 C
Hyderabad
May 2, 2024 16: 37 PM
Slider ప్రకాశం

తాగి ఊగేందుకు మంది వెసులుబాటు: రేట్ కిక్

#Adialabad Wines

మద్య నిషేధం అమలు జరుపుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మద్యం రేట్లను విపరీతంగా పెంచింది. మద్యం అధిక ధరకు అమ్మితే ఎవరూ తాగరని, తద్వారా మద్య నిషేధం అమలు జరిపినట్లేనని అధికారంలో ఉన్న వారు వాదించారు. పాపులర్ బ్రాండ్లు కాకుండా ఏపిలో ప్రత్యేక బ్రాండ్లు తీసుకువచ్చారు. ఇదంతా చీప్ లిక్కర్ అని దీనికి భారీ ఎత్తున రేట్లు పెట్టి దోచుకుంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కొన్ని బ్రాండ్లపై 180 ఎమ్ ఎల్ కు రూ.30 వరకూ తగ్గించింది. అధిక ధరలతో ఇంత కాలం సతమతం అయిన మందుబాబుల ఇబ్బంది తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మద్యం ధరలు తగ్గడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ఏపీలో మందు రేట్లు తగ్గించడంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ బ్రాందీ షాపు వద్ద మందుబాబుల పూజలు జరిపారు. మద్యం నిషేధం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మద్యం సేల్స్ మాత్రం విపరీతంగా పెరిగేందుకు అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. అందులోనూ వచ్చేది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా……

Related posts

ఎమ్మెల్యే క్రాంతిని సన్మానించిన టీయూడబ్ల్యూజే

Satyam NEWS

వాద్ నగర్ లో పండుగ ఉత్సవాల కుస్తీ పోటీలు

Satyam NEWS

లాక్ డౌన్ స్పెషల్: ఇంటికే మామిడి పండ్లు వచ్చేస్తాయ్

Satyam NEWS

Leave a Comment