31.2 C
Hyderabad
May 3, 2024 00: 45 AM
Slider ముఖ్యంశాలు

షెడ్యూల్: డోనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళతారు? ఏం చేస్తారు?

donald trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రేపటి నుంచి రెండు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్‌ ప్రకటించారు. పర్యటన షెడ్యూల్ ఇది: రేపు ఉదయం 11.55కి అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకుంటారు.

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మొతెరా స్టేడియం వరకు భారీ ర్యాలీ ఉంటుంది. మధ్యాహ్నం 12.30కి మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 3.30కి ఆగ్రా వెళతారు. సాయంత్రం 5.10కి తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. రాత్రి 7.30కి పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

అక్కడ ట్రంప్‌ దంపతులు మౌర్య హోటల్‌లో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 9.55కి రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్ చేరుకుంటారు తర్వాత 10.45కి రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.25కి హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-ట్రంప్‌ ఉమ్మడి మీడియా సమావేశం జరుగుతుంది. తర్వాత ద్వైపాక్షిక చర్చలు ఉంటాయి.

అనంతరం ట్రంప్‌- ప్రధాని మోదీ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2.55కి అమెరికా ఎంబసీలోని సిబ్బందితో ట్రంప్‌ భేటీ అవుతారు. రాత్రి 8గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు విందు ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి 10గంటలకు అమెరికాకు తిరిగి వెళ్లిపోతారు.

Related posts

పార్లమెంట్ పనితీరుపై విద్యార్థి దశలోనే అవగాహన

Satyam NEWS

సిద్దిపేట తరహాలో దుబ్బాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా

Satyam NEWS

సి.పి.యం ఆన్ లైన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment