29.7 C
Hyderabad
May 7, 2024 06: 43 AM
Slider కరీంనగర్

కరీంనగర్ లో  అత్యంత వైభవంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయం

#ministergangula

నేడు అమరావతిలో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదరరావు,  టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు సందర్శించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో కరీంనగర్ లో టీటీడీ శ్రీ వెంకటేశ్వరస్వామి మందిర నిర్మాణం అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అందులో భాగంగానే అమరావతిలోని ఆలయాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు వారు తెలిపారు.

ఎకరా విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఆలయ ప్రాంగణాన్ని అణువణువు పరిశీలించారు. ఆగమ, వాస్తు శాస్త్రం, ఆలయ నిర్మాణ శైలి, గర్భాలయం, అంతరాలయం, అర్థ మండపం, మహా మండపం, ముఖమండపం, గరుడాళ్వార్ సన్నిధి, ధ్వజస్తంభం, బలిపీఠం, తూర్పు రాజ గోపురం, ఉత్తర ద్వారం, ప్రాకార మండపాలు తదితర నిర్మాణ విశిష్టతలను  ఆలయ స్థపతులను అడిగి తెలుసుకున్నారు.

గతంలో జూబ్లీహిల్స్ టిటిడి ఆలయంతోపాటు కొన్ని ఇతర ఆలయ నిర్మాణాలను సైతం మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. కరీంనగర్ నగరం నడిబొడ్డున 100 కోట్ల విలువ చేసే పది ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ టిటిడి ఆలయ నిర్మాణం కోసం ఇదివరకే కేటాయించారు. ఈ ఆలయ నిర్మాణానికి టిటిడి బోర్డు సైతం గతంలోనే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్థల మంజూరు పత్రాలను అందుకున్న మంత్రి గంగుల తదుపరి చర్యలు చేపట్టారు. శి

లలను ఎక్కడి నుండి తెప్పిస్తున్నారు, ఎంత మంది శిల్పులు పాల్గొంటున్నారు, ఎన్ని రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తవుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే ఆలయం స్థపతులు గా పనిచేస్తున్న టీటీడీ ప్రధాన స్థపతి మునిస్వామి రెడ్డి, సహాయ స్థపతి కృష్ణారావు లను తమ వెంట కరీంనగర్ కు తోడ్కొని వెళ్లారు. రేపు టీటీడీ స్థపతులు, కరీంనగర్ రెవెన్యూ యంత్రాంగం, యాదాద్రికి పనిచేసిన ఆనంద్ సాయి తదితరులు కరీంనగర్లో ఆలయనిర్మాణం జరగబోయే స్థలాన్ని పరిశీలించి డిజైన్లు ఇవ్వాల్సిందిగా మంత్రి గంగుల ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి బృందాన్ని స్థానిక ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఆలయాన్ని నిర్మిస్తామన్నారు, ఇప్పటికే పూర్వ కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాలేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలకు దీటుగా కరీంనగర్ టిటిడి ఆలయం ఉండబోతుంది అన్నారు. కరీంనగర్ లో స్థల కొరత లేదని మరింత విశాలంగా భక్తులకు ఆధ్యాత్మికత సుగంధాలు వెదజల్లేలా కరీంనగర్ ఆలయం ఉండాలని బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆకాంక్షించారు.

Related posts

గజ్జి మల్లికార్జున్ కు ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ అవార్డు

Satyam NEWS

ఇంచార్జి ఎంపీపీగా ఉరుదొండ నరేష్

Satyam NEWS

కేసీఆర్ ను కలిసేందుకు నో చెప్పిన ప్రధాని మోడీ

Satyam NEWS

Leave a Comment