38.2 C
Hyderabad
May 3, 2024 20: 04 PM
Slider ప్రత్యేకం

సుదీర్ఘ చర్చల తరువాత ‘హైదరాబాద్’ డిక్లరేషన్ కు ఆమోదం

#egovernence

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనా సంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది ‘ మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితిలో డిజిటల్ పరిపాలన :భారతదేశంలో పరిస్థితి’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. సదస్సు ముగింపు సమావేశంలో రెండు రోజుల విస్తృత చర్చల తరువాత హైదరాబాద్ డిక్లరేషన్ ను ఏకగ్రీవంగా ఆమోదించింది.

సదస్సును కేంద్ర శాస్త్ర సాంకేతిక ( సహాయ), భూగర్భ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణు శాస్త్రం, అంతరిక్ష మంత్రిత్వ ( స్వతంత్ర) శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభ సమావేశం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు,పట్టణాభివృద్ధి,  ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు  అధ్యక్షతన జరిగింది.

ఈ-పరిపాలనను మరింత సమర్థంగా  అమలు చేయాల్సిన ఆధునిక తాజా సాంకేతిక అంశాలను సమగ్రంగా ఈ-పరిపాలనపై జరిగిన 24 వ జాతీయ సదస్సులో నిపుణులు చర్చించారు. ఈ-పరిపాలనను అమలు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సదస్సులో పాల్గొన్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు స్పష్టమైన అవగాహన పొందారు.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని అమలు చేసేందుకు అవకాశం కలుగుతుంది.

ఆరు అంశాలపై విడివిడిగా చర్చలు జరిగాయి, ఆత్మ నిర్భర్ భారత్, ప్రభుత్వ సేవలను ప్రజలందరికి అందుబాటులోకి తేవడం, సుపరిపాలకు సాంకేతికతను జోడించి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ విధానాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం, భారత దేశ టెకాడే- డిజిటల్ ఆర్థిక వ్యవస్థ (డిజిటల్ చెల్లింపులు-ప్రజల విశ్వాసం)పై నిపుణులు చర్చలు జరిపారు. దీనికి సమాంతరంగా జరిగిన సమావేశాల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ-పరిపాలన అంశంలో అవార్డులు సాధించిన వ్యక్తులు తమ అనుభవాలు, అవార్డు సాధించిన తమ పనులను వివరించారు.

యునికార్న్స్ 2021, ఆవిష్కరణల శక్తి, డిజిటల్ వ్యవస్థలో  జిల్లా స్థాయి ప్రతిభ, సులభతర పరిపాలన, వినూత్న పర్యావరణ వ్యవస్థ, భౌతిక ప్రమేయం లేకుండా సాంకేతికత సహకారంతో సేవలను అందించడం,ఈ పరిపాలన ఉత్తమ విధానాలపై చర్చలు జరిగాయి. ఈ-పరిపాలనలో భారతదేశం సాధించిన విజయాలు, ప్రగతిపై ప్రత్యేక ప్రదర్శనను సదస్సు సందర్భంగా ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై 50 మందికి పైగా నిపుణులు పత్రాలను సమర్పించారు. సదస్సుకు 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రారంభ సమావేశంలో జాతీయ ఇ-గవర్నెన్స్ అవార్డు 2021నలను  అందించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు/శాఖలు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత  ప్రభుత్వాలు, జిల్లాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్య, పరిశోధనా సంస్థలకు  6 కేటగిరీల కింద 26 అవార్డులు అందించారు. ఇందులో 12 స్వర్ణాలు, 13 రజతాలు మరియు 1 జ్యూరీ అవార్డులు ఉన్నాయి.

సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రముఖులు, పరిశోధకులు సహా ప్రతినిధులకు ఉత్తమ విధానాలు , తాజా సాంకేతిక పరిణామాలు పంచుకోవడానికి సదస్సు ఒక  వేదికను అందించింది. సమర్థవంతమైన పాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సదస్సు స్ఫూర్తి కలిగించింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అమలు చేయాల్సిన ఈ-పరిపాలన సాధనాలను పంచుకోవడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్న ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ సాధన అంశాలకు సదస్సు ప్రాధాన్యత ఇచ్చి దీనికి అవసరమైన వ్యూహ రచనపై దృష్టి సారించి సాగింది.

Related posts

15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

ఉద్యోగులకు రెండేళ్లకే ప్రమోషన్

Satyam NEWS

అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ

Bhavani

Leave a Comment