బహిరంగంగా మద్యపానం చేసినందుకు ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ కొల్లాపూర్ స్పెషల్ మేజిస్ట్రేట్ విజయకుమార్ తీర్పు చెప్పారు. ఆదివారం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదు మందిని స్థానిక ఎస్ఐ కొల్లాపూర్ ఎస్ఐ కొంపల్లి మురళి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నేడు వారిని కోర్టులో హాజరు పరిచారు.
ఈ సందర్భంగా జడ్జి ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇద్దరికీ ఫైన్ విధించారు విధించారని అని ఎస్ఐ మురళి గౌడ్ తెలియజేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఏల్లూరు రూట్ లో గెస్ట్ హౌస్ ఆపోజిట్ ఖాళీ స్థలంలో కూర్చుని బహిరంగంగా మద్యం సేవించినందుకు పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులకు రూ.2000, రూ. 2500 చొప్పున ఫైన్ వేశారు.