శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ఇద్దరు మహిళలు మరణించారు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డు లో ఇష్టకామేశ్వరి గేటు సమీపంలో జరిగినది.
రెండు RTC బస్ లు ఢీ కొనటంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సుండిపెంట వైద్యశాలకు తరలించారు. ఢీ కొన్న రెండు బస్సులలో ఒకటి ధర్మవరం డిపో బస్సు కాగా మరొకటి రాజమండ్రి డిపో బస్సు.