29.7 C
Hyderabad
April 29, 2024 08: 49 AM
Slider ముఖ్యంశాలు

అంతర్జాతీయ స్థాయికి బతుకమ్మ పండుగ

#batukamma

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయిలో జరుపు కొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయడం చాలా గర్వకారణం అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఏ కే ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా  జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా, నల్లకుంట కార్పొరేటర్ అమృత, కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమారమేశ్ యాదవ్ తో కలిసి నియోజకవర్గంలోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుత ప్రతి సంవత్సరం మహిళలకు చీరలను అందించడం జరుగుతుంది అని తెలియజేశారు.

భారతదేశంలో మహిళలను గౌరవించే  రాష్ట్రలలో మన తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందని, ఇప్పటికే మహిళలకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, కెసిఆర్ కిట్టు, ఆసరా పింఛన్లు, అలాగే షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డిసి వేణుగోపాల్, డిపిఓ రజిత, ఏఎంఓహెచ్ జ్యోతిబాయ్, సివిల్ సప్లై అధికారి దీప్తి, మహిళా మండలి సభ్యులు నియోజకవర్గ మహిళలు టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి

Satyam NEWS

పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వైపు ప్రజలు వెళ్లేలా చేయాలి

Satyam NEWS

కోనసీమలో కరోనా కలకలం.. 24 విద్యార్థులకు పాజిటివ్..

Satyam NEWS

Leave a Comment