42.2 C
Hyderabad
May 3, 2024 17: 01 PM
Slider నల్గొండ

యూ.జి.సి.సర్య్కూలర్ వెనక్కి తీసుకోవాలి

#SFI Nalgonda

దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో  రానున్న సెప్టెంబర్ నెలలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని దానికోసం ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా నిర్వహించుకోవచ్చుననీ యూనివర్శీటీలకు ఇచ్చిన సర్య్కూలర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. జిల్లా కార్యదర్శి మల్లం మహేష్  ప్రభుత్వాని డిమాండ్ చేసారు.

గురువారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా యూ.జి.సి ఇచ్చిన గైడ్ లైన్స్ ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కరోనా దేశంలో విలయతాండవం చేస్తూ ప్రపంచంలో మూడవస్థానానికి భారత్ చేరుకున్న సందర్బంలో విధ్యార్ధులుఅంతా యూనివర్శీటీలనుండి వారి స్వస్థలాలకు వెళ్ళారని అక్కడ వారు హోం క్వారంటైన్లో కొద్ది మంది ఉన్నారని అన్నారు. మళ్ళీ వారి యూనివర్శీటిలకు రావాలంటే రైల్వే సౌకర్యంలేని పరిస్థితి ఉందన్నారు.

దీనితో పాటు దేశ రాజదాని లాంటి ప్రధాన నగరాల్లో కరోనా వ్యాప్తి ఏక్కువ ఉంటే ఏలా ఇది సాధ్యం అవుతోంది. భౌతిక దూరం పాటించి ఉండలన్నా అలాంటి సౌకర్యాలు యూనివర్శిటిలలో లేవన్నారు. దీనితోపాటు గత మూడ నెలల కాలంలో ఎలాంటి తరగతులు నడవలేదన్నారు.

ఇక ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించాలంటే ఆన్ లైన్ ,ఇంటర్ నెట్ కనెక్టివిటీ సరిగ్గా లేని ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయన్నారు..370ఆర్టీకల్ రద్దుతో కాశ్మీర్ లోని ప్రభుత్వం ఇంటర్ నెట్ షట్ డౌన్ చేశారని కేవలం 2జి నెట్ వర్క్ మాత్రేమే ఉంటే  పరీక్షలు ఏలా రాస్తరని ప్రశ్నించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ లోని కునుమాన్ యూనివర్శీటి ఈ ఆన్ లైన్ తరగతులు, పరీక్షలునిర్వహణ యంత్రాంగం, సౌకర్యాలు లేవన్ని మాకు సాధ్యం కాదని తెలిపారు.

ఇలాంటి పరిస్థితి అన్ని రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మద్య ప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు రద్దు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రకాల పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే యూ.జి.సి ఇచ్చిన సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని మహేష్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు గోలి సాయికిరణ్ ,అవిశేట్టి కిరణ్ ,బి వేంకటేష్ నవిన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వారసత్వ కట్టడాలకు కాలం చెల్లినట్లేనా?

Sub Editor

వనజీవి రామయ్య కుమారుడు మృతి

Bhavani

మర్డర్ ఏ ఒక్కరి కుటుంబ కధ కాదు

Satyam NEWS

Leave a Comment