39.2 C
Hyderabad
May 3, 2024 12: 14 PM
Slider రంగారెడ్డి

పేరుకే అండర్ బ్రిడ్జ్ ఉపయోగంలో నిల్

#underbridge

పేరుకే అండర్ బ్రిడ్జి ఉపయోగంలో నిల్ అని బిజెపి నేత రవి కుమార్ యాదవ్ ఎద్దేవ చేశారు. మంగళవారం శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, సందయ్య నగర్ ,సురభి కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా బిజెపి నేత రవికుమార్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం దాదాపు 3 కోట్ల రూపాయలతో అండర్ పాస్ బ్రిడ్జినీ నిర్మించారని ఆబ్రిడ్జే ప్రస్తుతం ప్రజలకు శాపంగా మారిందని ప్రతి వర్షాకాలం వర్షపు నీరు వచ్చి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, దీని వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, గతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో అప్పటి అధికారులు నామమాత్రంగా 20 లక్షల రూపాయలతో సరైన ఎలాంటి ప్రణాళిక లేకుండా మరమ్మత్తులు చేశారన్నారు.

కాగా ఈ సమస్య ఎదావిధంగా పునరావృతం అవుతుందని చందానగర్ ఉడా కాలనీ వాసులు ప్రతివారం పాపిరెడ్డి కాలనీలో నిర్వహించే వారంతపు సంతలకు కూడా రాకపోకలు ఇక్కడ నుంచే కొనసాగిస్తారని అలాంటి సమయంలో రైలు యాక్సిడెంట్లకు అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని రవికుమార్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వం , ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శమన్నారు. కనీస ప్రణాళిక లేకుండా లక్షల రూపాయలు ఎలా వృధా చేస్తారని అధికారులను ప్రశ్నించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టి నెలలు గడుస్తున్నా జిహెచ్ఎంసి అధికారులు అండర్ పాస్ బ్రిడ్జిని పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ బ్రిడ్జిని పునరుద్ధరించాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లేష్, రమేష్, అనిల్ కుమార్ యాదవ్, ఆదిత్య కుమార్ ,శ్రీనివాస్, నర్సింగ్ యాదవ్, నీలకంఠ రెడ్డి, నాగేశ్వరరావు, బాలయ్య, రాజ మల్లయ్య, జనార్దన్ రెడ్డి, రాజేష్, ఇమ్రాన్, శ్రీకాంత్, అరుణ, సుశీల, రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వర రావు కన్నుమూత

Satyam NEWS

చురుకుగా సాగుతున్న రోడ్ వైడెనింగ్ పనులు

Satyam NEWS

ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభ ఏర్పాట్లు పై చర్చించిన పువ్వాడ, ఎన్టీఆర్

Bhavani

Leave a Comment