39.2 C
Hyderabad
April 28, 2024 15: 01 PM
Slider ముఖ్యంశాలు

ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభ ఏర్పాట్లు పై చర్చించిన పువ్వాడ, ఎన్టీఆర్

#NTR

ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్.టీ. రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన నివాసంలో కలిసి విగ్రహావిష్కరణ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు పై వారు చర్చించారు.ఈ నేపథ్యంలో మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు.ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపుకు రంగం సిద్ధమైంది, మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు..

బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు.రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందారు.

Related posts

దక్షిణ తెలంగాణ ను ఎడారి చేస్తారా?

Satyam NEWS

చనిపోయినా నలుగురికి గుర్తున్నాడు

Satyam NEWS

ఆర్డీవో కేసులు వాయిదా వేయాలని వినతి పత్రం

Satyam NEWS

Leave a Comment