23.2 C
Hyderabad
May 7, 2024 19: 48 PM
Slider జాతీయం

కరోనా వేళ సంక్షేమ మార్గంలో నిర్మలమ్మ బడ్జెట్

#NirmalaSeetaraman

కరోనా మహమ్మారి దేశాన్ని ఆక్రమించిన వేళ ఆశల పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో పెడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి లోక్​సభలో వార్షిక బడ్జెట్​ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు.

80 మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్ లు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ కు 21.17లక్షల కోట్లు కేటాయించారు.

అదే విధంగా ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ లక్ష్మీ కి 2.75లక్షల కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి 64,180కోట్ల తో ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధిని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.

కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 35 వేల కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. బడ్జెట్ లో ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం తో లాభాల్లో ఫార్మా స్టాక్ మార్కెట్ పయనిస్తున్నది.

ముందుగా నిర్మలా సీతారామన్ తన బృందంతో వెళ్లి రాష్ట్ర పతి రామ్ నాథ్ గోవింద్ ను కలిశారు.

Related posts

త్వరలోనే నూతన నాలా నిర్మాణాన్ని చేపడతాం

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

Satyam NEWS

అయ్యగారు ఫుల్ బిజీ ఆయన చెబితే కానీ పని జరగదు

Satyam NEWS

Leave a Comment