30.7 C
Hyderabad
April 29, 2024 05: 03 AM
Slider అనంతపురం

ప్రాజెక్టులను ప్రీ క్లోజ్ చేస్తున్న జగన్ రెడ్డి

#Chandra babu Visakhapatnam

తాము అధికారంలో ఉన్నప్పుడు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.4,182 కోట్లు ఖర్చు చేశామని అయితే వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో చేసిన ఖర్చు కేవలం రూ.515 కోట్లు మాత్రమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై టీడీపీ యుద్ధభేరి చేపట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగా అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు స్థితిగతులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

రాష్ట్రానికి ఒక వ్యక్తి వల్ల ఎంత అన్యాయం జరిగిందో అందరూ ఆలోచించాలని చంద్రబాబు కోరారు. బడ్జెట్ లో కేవలం 2.35 శాతం ఖర్చు చేస్తే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమా? మారాల రిజర్వాయర్ ను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కాల్వలు పూర్తి చేస్తానని వైసీపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని ఆయన అన్నారు. జీడిపల్లి-భరవానితిప్ప లిఫ్ట్ కు నాలుగేళ్లలో అంగుళం పని కూడా సాగలేదు. జీడిపల్లి-పెరూరుకు టీడీపీ ప్రభుత్వం రూ.60 కోట్లు ఖర్చు చేసింది.

ఒకప్పుడు అనంతపురం అంటే క్లాక్ టవర్ గుర్తొచ్చేది.. ఇప్పుడు కియా పరిశ్రమ గుర్తొస్తుంది. కియా పరిశ్రమ కోసం గుజరాత్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి. నేను ఇచ్చిన స్పష్టమైన హామీతో కియా పరిశ్రమ అనంతకు వచ్చింద అని చంద్రబాబు తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగితే దేశంలో కరువు అనేది ఉండదు.

గొల్లపల్లి రిజర్వాయర్ ఆయకట్టు 4 వేల ఎకరాలు 6 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా పరిశ్రమకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. సాగునీటి రంగానికి చేసిన మోసానికి మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అనంతపురం జిల్లాలో మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించాం. మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ను 90 శాతం సబ్సిడీతో అందించాం.

జగన్ అధికారంలోకి వస్తూనే 360 జీవో తీసుకొచ్చాడు. 198 సాగునీటి ప్రాజెక్ట్ పనులను ప్రీ క్లోజ్ చేశాడు. ఒక్క రాయలసీమలోనే 102 ప్రాజెక్ట్ లు ప్రీ క్లోజ్ చేశాడని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో 38 ప్రాజెక్ట్ లు ప్రీ క్లోజ్ చేశారని తెలిపారు. టీడీపీ చేసిన అభివృద్ధికి జగన్ తన పేరు వేసుకుంటున్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే సబ్సిడీ ఎత్తివేతతో సాగు విస్తీర్ణం తగ్గింది. టీడీపీ హయాంలోని డ్రిప్ పరికరాలు గుట్టలుగా వృథాగా పడి ఉన్నాయని ఆయన తెలిపారు. జగన్ రివర్స్ నిర్ణయాలతో 198 సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రీ క్లోజ్ చేశారు. దోపిడీకి అంతమే లేదన్నట్లుగా దోచుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రాజెక్టులు, గనులు దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Related posts

దేశ ఆర్ధిక వ్యవ్థకు ఉద్దీపన చర్యలు

Satyam NEWS

త్రిబుల్ వన్ జీవో అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి

Satyam NEWS

శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కొల్లాపూర్ సేవా సమితి చైర్మన్ రంగినేని

Satyam NEWS

Leave a Comment