26.7 C
Hyderabad
May 15, 2024 10: 08 AM
Slider ముఖ్యంశాలు

గుంకలం లే అవుట్ ను ప‌రిశీలించిన కేంద్ర మంత్రి మాండ‌వీయ‌…!

వేదికను ప‌క్క‌న పెట్టి..నేరుగా ల‌బ్దిదారుల వ‌ద్ద‌కు వెళ్లి మాట్లాడిన మంత్రి….!

త‌న రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఏపీలోని విజ‌య‌న‌గ‌రానికి వ‌చ్చిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ‌మంత్రి డా. మ‌న్ సుఖ్ మాండ‌వీయ‌…. గుంక‌లాం లే అవుట్ ను ప‌రిశీలించారు. పీఎంఇవై ప‌థ‌కం ద్వారా ల‌బ్దిదారులు ఏ మేర‌కు ఆ ప‌ధ‌కాన్ని వినియోగించుకుంటున్నారు…కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు రాష్ట్ర ప్ర‌బుత్వం ఏ విధంగా లే అవుట్ ల‌ను ముడిస‌రుకును స‌ర‌ఫ‌రా చే్స్తున్న‌ది క్షుణ్ణంగా వారినే అడిగి తెలుసుకున్నారు.

అస‌లు జిల్లా యంత్రాంగం అందునా హౌసింగ్ శాఖ లే అవుట్ లోనే కేంద్ర మంత్రి మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేసింది. కానీ గుంక‌లాం లే అవుట్ కు కేంద్ర మంత్రిని తీసుకొచ్చిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ…అక్క‌డే బోర్డుపై పెట్టిన లే అవుట్ న‌మోనాను కేంద్ర మంత్రికి వివ‌రించారు.

అక్క‌డ నుంచీ వేదిక‌పైకి వెళ‌తారేర‌మోన‌ని అటు క‌లెక్ట‌ర్,ఇటు హౌసింగ జేసీ మ‌యూర్ అశోక్ లు ఊహించారు.కాని అంత‌లోనే వేద‌క ఎదురుగా ఉన్న ల‌బ్దిదారుల వ‌ద్దకు వెళ్లి గ్రౌండ్ లెవిల్ వారు అనుభ‌విస్తున్న సాద‌క బాధ‌ల‌ను,స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కొంద‌రు గుజ‌రాతీలు,మార్వాడీలు స్థానికులు గా ఉండ‌టంతో వాళ్ల‌ను గుర్తించిన క‌లెక్ట‌ర్..ఆ ల‌బ్దిదారుల‌ను కేంద్ర మంత్రికి ప‌రిచ‌యం చేసారు.

దీంతో వాళ్ల‌తో కేంద్ర మంత్రి మాండ‌వీయ‌… ఇండ్లు క‌ట్టుకుంటున్నారా..? స‌హాయాలు అందుతున్నాయా అంటూ హిందీలోనే వారంతా స‌మాధానం ఇచ్చారు.అయితే కొంత మంది త‌మ‌కు విద్యుత్ ఉన్నా..నీరు., లేదంటూ ఫిర్యాదు చేయ‌డంతో జేడ్పీ చైర్మ‌న్ క‌లుగ చేసుకుని…డిఈని అక్క‌డిక్క‌డే పిలిపించి.. చ‌ర్య‌లు తీసుకోమ‌ని కేంద్ర మంత్రి ముందే చెప్పారు. కేవ‌లం 45 నిమిషాలు మాత్ర‌మే….గుంక‌లాంలో ఉండి..అటు స్థలాన్ని..ఇటు ల‌బ్దిదారుల‌తో మాట్లాడారు.

ఎం. భారత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

Related posts

ప్రపంచ ఓపెన్ మారథాన్ లో సత్తాచాటిన ఓరుగల్లు కుర్రాడు

Satyam NEWS

సినిమా రివ్యూ: ఆకట్టుకున్న యండమూరి వీరేంద్రనాధ్ అతడు ఆమె ప్రియుడు

Satyam NEWS

జలసంరక్షణలో ఏపికి అవార్డుల పంట

Satyam NEWS

Leave a Comment