27.7 C
Hyderabad
April 30, 2024 10: 49 AM
Slider జాతీయం

అమ్మ యోగీ!: విడాకులు తీసుకున్నారా అయితే ఓకే

777373-yogiadityanath

ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలతో పాటు భర్తల నుంచి విడాకులు పొందిన ఇతర మతాల మహిళలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు శుభవార్త వెల్లడించింది. ట్రిపుల్ తలాఖ్ పొందిన వివాహితలకు పునరావాసం కల్పించేందుకు వీలుగా ఒక్కొక్కరికి 2020 నుంచి ఏటా ఆరువేల రూపాయల ఆర్థికసాయం అందిస్తుందని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ప్రకటించారు.

దీంతోపాటు ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలకు ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయసహాయం అందిస్తామని సీఎం వెల్లడించారు. ట్రిపుల్ తలాఖ్ పొందిన ముస్లిమ్ మహిళలు 5వేల మందికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

దీంతోపాటు ఇతర మతాల్లో విడాకులు పొందిన మహిళలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని సీఎం నిర్ణయించారు. ట్రిపుల్ తలాఖ్ పొందిన మహిళలు పెట్టిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లను ఇస్తే చాలు ఈ పథకం కింద సర్కారు ఆర్థికసాయం అందజేయనుంది.

Related posts

HYDERABAD ORR హెల్ప్ లైన్ కొత్త నెంబర్ ఇదే

Bhavani

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఆదిలాబాద్ లో సిపిఐ ధర్నా

Satyam NEWS

(Official) = Can Metamucil Lower Blood Sugar

Bhavani

Leave a Comment