29.7 C
Hyderabad
April 29, 2024 10: 42 AM
Slider రంగారెడ్డి

ఉప్పల ట్రస్ట్ మాకు ఓ కల్పవృక్షం

#uppala charatable trust

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మాకు ఓ కల్పవృక్షం అని జంగి రెడ్డి పల్లి గ్రామస్తులు కొనియాడారు. జిల్లా తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 48 నిరుపేదల కుటుంబాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గృహాలు నిర్మించి ఇస్తున్నారు.

శుక్రవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ నిర్మాణాలస్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఇండ్లు ఫినిషింగ్ దశలో మిగితా 18 గృహాలు స్లాబ్ వేసే వరకు వచ్చిందని అదేవిధంగా మరొక 12 మంది నిరుపేదలకు ఇండ్లు లేవని తన దృష్టికి వచ్చిందని వారికి కూడా సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని  ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు  విలేకర్లతో మాట్లాడుతూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కలియుగంలో ఓ   కల్పవృక్షం అని, మా మండలంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారని, కరోనా  సందర్భంలో కూడా మందుల కిట్లు బియ్యం కూరగాయలు వివిధ అవసరాలు తీరుస్తూ మమ్మల్ని  ఆదుకున్నారని తెలిపారు.

ఓట్ల అప్పుడు  ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే నేటికీ కనిపించలేదని దుమ్మెత్తిపోశారు.ఎవరు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మూడు వేల రూపాయలు చొప్పున అందజేస్తున్నారన్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా వైద్య ఖర్చులు ఇస్తూ ఆదుకుంటున్నారు అని, ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సైతం ఉచితంగా అడ్మిషన్లు ఇప్పిస్తున్నారని పేర్కొన్నారు. మా బాగోగులు కుటుంబీకులకంటే వారే మాపై శ్రద్ధ చూపిస్తారని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కలియుగ కల్ప వృక్షం అని తెలిపారు.

Related posts

ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఎస్పీ సాక్షి గా ఆగిపోయిన ఆర్టీసీ బస్సు…

Satyam NEWS

“ఐశ్వర్యకు తోడుగా అభిరామ్”తో యష్ రాజ్ అరంగేట్రం

Satyam NEWS

జనం నోట అన్నమయ్య సంకీర్తనలు

Bhavani

Leave a Comment