26.7 C
Hyderabad
May 15, 2024 08: 57 AM
Slider ముఖ్యంశాలు

15 నుండి 18 సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యాక్సిన్ తప్పనిసరి

#coronavaccine

15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులు కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు పిల్లలను ప్రోత్సహించాలని మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, మండల విద్యాధికారి సైదానాయక్ తెలియజేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన వాక్సిన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్,మండల విద్యాశాఖాధికారి సైదా నాయక్ మాట్లాడుతూ కరోనా ను ధీటుగా ఎదుర్కొనేందుకు వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గమని,ప్రజలు రెండవ డోస్ వేసుకోవడంలో నిర్లక్ష్యం వహిచరాదని,రెండు డోస్ ల వాక్సిన్ పొందిన వారికి మాత్రమే సంపూర్ణ  రక్షణ లభిసుందని అన్నారు.రెండవ డోస్ సమయము కాగానే వెంటనే దగ్గరలో ఉన్న వాక్సిన్ కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.

ప్రజలు కోవిద్ నిబంధనలను  తప్పనిసరిగా పాటించాలని,మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్ర పర్చుకోవడం తప్పనిసరి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణాధికారి జి.ప్రభాకర్,ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు తాతరాజు శ్రీను,ఆరోగ్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ,సిహచ్.సంతోషం  ఉపాధ్యాయులు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో విఫలం

Satyam NEWS

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

ఇరకాటంలో కొడాలి నాని….

Satyam NEWS

Leave a Comment