29.7 C
Hyderabad
April 29, 2024 07: 21 AM
Slider నల్గొండ

రానున్న రోజుల్లో బిజెపి కి పరాభవం తప్పదు

#trs

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ బిజెపి జేపీ నడ్డా ప్రశాంతంగా  తెలంగాణలో ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాల సాగుకు సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని,ఎవరో బిజెపి నాయకులు స్క్రిప్ట్ రాసిస్తే అది చదివి తెలంగాణలో ఆయనకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారని,కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత సిఎం కెసిఆర్ దే అని అన్నారు.

ధాన్యం కొనుగోలు చేయను అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్తే ఆ రోజు కనీసం నోరు మెదపని బిజెపి  నాయకులు నేడు 317 జిఓ పై పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని,కేంద్ర ప్రభుత్వమే కరోనా గైడ్ లైన్స్ ఇస్తే,అదే గైడ్ లైన్స్ ను మీరు అతిక్రమించడం, దాన్ని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టి పై నోరుమెదపని బిజెపి నాయకులు నేడు రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డు పడుతున్నారని,తెలంగాణలో అద్భుతంగా అమలు అవుతున్న పథకాలను చూసి కాపీ కొడుతున్న బిజెపి ప్రభుత్వం ఆ పథకాలు నడిపించడం చేతకాక అట్టర్ ఫ్లాప్ అయ్యిందని,కేంద్ర బిజెపి ప్రభుత్వం

నీటి పంపకాల్లో ఇబ్బంది పడుతున్నా తెలంగాణ రాష్ట్రం కోసం ఎప్పుడూ కూడా గళ మెత్తని బిజెపి ఎంపీలు నేడు కొత్త కొత్త డ్రామాలకు తెర లేపుతున్నారని,ప్రాంతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా పరాభవం తప్పదని,50 వేల కోట్ల రూపాయలతో రైతుబంధు విడుదల చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ కంటే ముందే సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కె.ఎల్.ఎన్.రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, సింగిల్ విండో చైర్మన్ యరగని శ్రీనివాస్ గౌడ్, వీర్లపాటి భాస్కర్,తండు హరికృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి

Satyam NEWS

బస్ షెల్టర్ ను కూలగొట్టిన వైసీపీ గూండాలు

Satyam NEWS

బిల్లు కట్టకపోవడంతో సమాచార శాఖ సెల్ ఫోన్ లు బంద్

Satyam NEWS

Leave a Comment