అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో వెలసిన శ్రీభగళముఖి దేవి అమ్మవారి, శ్రీసిద్దేశ్వరస్వామిల ఉత్సవాలు నేటి నుంచి 11 వరకు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు గణపతి పూజతో ప్రారంభమవుతాయి.
భగళముఖి దేవి రథోత్సవం 10 వ తేదీ సోమవారం సాయంత్రం జరుగుతుంది. 11 న తెల్లవారుజామున శ్రీసిద్ధేశ్వర స్వామి వారి రథోత్సవం జరగనుంది. రథోత్సవం సందర్భంగా భవిష్యవాణి చెప్పటం ఇక్కడి ప్రత్యేకత. వర్షాలు, ఏ పంటలు పండుతాయి తదితర అంశాలు భవిష్యవాణిలో స్వామివారు పునిన వ్యక్తి చెబుతారు. అవి చాలా వరకు నిజమయ్యాయని ఉరవకొండ ప్రాంత వాసుల నమ్మకం.