28.7 C
Hyderabad
May 6, 2024 07: 13 AM
Slider మహబూబ్ నగర్

భావితరాలకు ఆదర్శం వాల్మీకి మహర్షి: రంగినేని అభిలాష్ రావు

#valmiki

చీమల పుట్టను ఛేదించి జ్ఞానోదయం పొందిన వ్యక్తి వాల్మీకి అని రంగినేని  అభిలాష్ రావు అన్నారు. బుధవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా గా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో వాల్మీకి కమిటీ సభ్యులు వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యుల  ఆహ్వానం మేరకు రంగినేని అభిలాష్ రావు  వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ముందుగా  జ్యోతిని వెలిగించి పూజ కార్యక్రమాలు చేశారు. చిత్రపటానికి పూలమాల వేసి దర్శించుకున్నారు. వాల్మీకి కమిటీ సభ్యులకు మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం  అభిలాష్ రావు మాట్లాడారు. కుటుంబ విలువలతో పాటు మహోన్నతమైన రాజ్యపాలనను వివరించే అద్భుత కావ్యం రామాయణం అన్నారు. రామాయణాన్ని ప్రపంచమంతట పారాయణం చేస్తారని, రామాయణం అంటే వాల్మీకి రామాయణమే ప్రామణికమైనదని అన్నారు.

మహర్షి వాల్మీకిని స్థిత ప్రజ్ఞతకు గుర్తుగా చెప్పుకోవాలని, అకుంఠిత తపస్సు చేసి తనపై చేరిన చీమల పుట్టను ఛేదించి జ్ఞానోదయం పొందారని చెప్పారు. అంధకార, అజ్ఞానం చెడుల నుండి బయట పడితే మహర్షులవుతారాన్నారు. సర్వావస్తల యందు గుర్తు పెట్టుకోవలసిన వ్యక్తి వాల్మీకి అని కొనియాడారు.అంతక ముందు కమిటీ సభ్యులు రంగినేని అభిలాష్ రావు ను శాలువా కప్పి సన్మానించారు.

Related posts

జగన్ ‘‘వైజాగ్ కోరిక’’పై చావుదెబ్బ కొట్టిన కేంద్రం

Bhavani

కొడాలి నాని నోటికి ఎన్నికల కమిషనర్ తాళం

Satyam NEWS

రోగులకు మందులు ఇచ్చేందుకు చేతులు రావా?

Satyam NEWS

Leave a Comment