38.2 C
Hyderabad
May 2, 2024 19: 52 PM
Slider ప్రపంచం

వలలో జల దేవత: పాకిస్తాన్ జాలరులు రాత మార్చిన క్రోకర్ ఫిష్

valuable croaker fish in fisher men net in pakistan

తినడానికో బతుకు దెరువుకో తాము నమ్ముకున్న చేపల వేట అప్పుడప్పుడు మత్స్యకారుల తలరాతలు మారుస్తాయి. వారు వేసిన వలకు అప్పుడప్పుడు ఎంతో అరుదైన చేపలు పడుతుంటాయి. ఆ చేపలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ను బట్టి వాటికి లక్షల్లో ధర పలుకుతుంది. పాకిస్థాన్ లోని గ్వాదర్ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు కూడా ఇలాంటి చేప కారణంగా రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు.

జివానీలో నివసించే సదరు మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతడి వలలో ఎంతో అరుదైన సోవా లేక కిరి అని స్థానికం గా పిలిచే క్రోకర్ ఫిష్ పడింది. ఈ చేప 48 కిలోల బరువు తూగింది. దీన్ని వేలం వేయగా కళ్లు చెదిరే రీతిలో రూ.8.64 లక్షల ధర కు కొనుక్కున్నారు.

ఇంతకీ ఈ చేప విశేషమేమిటంటే ఈ చేపలోని ఓ భాగాన్ని ఫార్మా రంగంలో శస్త్రచికిత్సలో వినియోగించే పరికరాల తయారీకి దీన్ని వినియోగిస్తారు. అందుకే ఈ క్రోకర్ ఫిష్ కు అంత డిమాండ్! ఆసియాలోని కొన్ని ప్రాంతాలు,ముఖ్యం గా యూరప్ లో దీనికి అత్యధిక ధర పలుకుతుంది. ఇటీవలే జివానిలో ఇలాంటిదే ఓ చేప లభ్యం కాగా, అది రూ.7.80 లక్షలు పలికినట్టు వెల్లడైంది.

పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్టుకు, ఇరాన్ కు మధ్య ఉన్న సముద్ర జలాల్లో ఈ తరహా చేపలు ఎక్కువగా లభ్యమవుతాయి.ఎలాగైతేనేమి తమ రాతను మార్చిన చెప్పాను అమ్మిన ఆ జాలరులు ఆనందంలో తేలియాడారు.

Related posts

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న “లక్నవరం గెస్ట్ హౌస్”

Satyam NEWS

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

Satyam NEWS

సీరియల్ చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Satyam NEWS

Leave a Comment