40.2 C
Hyderabad
May 2, 2024 17: 22 PM
Slider ముఖ్యంశాలు

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

#grampanchyati

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కల్వకుర్తి నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముట్టడికి తరలి వెళుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానంతో అధికారులు,సర్పంచులు వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామపంచాయతీ కార్మికులకు నెల నెల వచ్చే 8500 జీతం కొన్ని కొన్ని గ్రామాల్లో కార్మికులకు సక్రమంగా అందడం లేదని అన్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26000 అమలు చేసి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.కలెక్టర్ కార్యాలయం ముట్టడికి వెళ్ళిన వారిలో కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మహేష్, కార్యదర్శులు శంకర్, పెంటయ్య,కార్మికులు వెంకటయ్య,బాలయ్య,తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరంలో ముగిసిన ఏబీవీపీ మహా సభలు

Satyam NEWS

మరో 7 పిటీషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు

Satyam NEWS

ఎన్ ఎస్ పి కాలవ కట్టపై కూల్చిన గుడిసె వాసులకు నష్టపరిహారం చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment