40.2 C
Hyderabad
April 26, 2024 11: 09 AM
Slider వరంగల్

సీరియల్ చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

#WarangalPolice

తాళంవేసి వున్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఒక వ్యక్తిని సి.సి.ఎస్, మామూనూరు పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు సుమారు 3లక్షల 50వేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి. పుష్ప వివరాలను వెల్లడిస్తూ, మహబూబూబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన అంగడి జంపయ్య మొదట రోజువారి కూలీ పనులు చేసేవాడు.

వచ్చిన అదాయంతో మద్యం సేవిస్తూ ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. వచ్చిన అదాయం తన వ్యసనాలకు సరిపోకపోవడంతో చోరీకి సిద్ధపడ్డాడు. 2005 సంవత్సరం నుండి నిందితుడు వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడా, హసనపర్తి, వర్ధన్నపేట, రాయపర్తి, జనగాం పోలీస్ స్టేషన్లతో పాటు రాష్ట్రంలోని ఖమ్మం, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దోపిడీలు, చైన్ స్నాచింగ్ ద్వీచక్ర వాహనాల చోరీలు చేశాడు.

తాళం వేసివున్న పలు ఇళ్లలో నూ నిందితుడు చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు పలుమార్లు పోలీసులకు చిక్కి పలుమార్లు జైలు జీవితం అనుభవించాడు. చివరగా నిందితుడు గత సంవత్సరం జూన్ 6వ తేదిన చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించి జైలు నుండి విడుదలైనాడు.

జైలు నుండి నిందితుడు బయటికి వచ్చిన అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. నిందితుడు ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో మామునూర్, మట్టేవాడ, ఖాజీపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు.

దీనితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, క్రైం ఎ.సి.పి బాబురావు పర్యవేక్షణలో సి.సి.ఎస్ ఇన్స్ స్పెక్టర్ రమేష్ కుమార్, మామూనూర్ ఇన్స్ స్పెక్టర్ రమేష్ అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుడి పట్టుకొనేందుకు దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించారు.

ఇందులో భాగంగా నిందితుడు తాను చోరీ చేసిన బంగారాన్ని అమ్మేందుకువరంగల్‌కు వస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందటంతో పోలీసులు ఖమ్మం రోడ్డులోని నాయుడు పెట్రో పంపు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోని తనీఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు అభరణాలను గుర్తించారు.

నిందితుడుని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, మామూనూర్ ఇన్ స్పెక్టర్ రమేష్ నాయక్, సిసిఎస్ ఎస్.ఐ సంపత్ కుమార్, ఎ.ఎస్.ఐ శ్రీనివాస్ రాజు, హెడ్ కానిస్టేబుళ్ళు రవికుమార్, కానిస్టేబుళ్ళు మహమ్మద్ ఆలీ, వేణుగోపాల్, నజీరుద్దీన్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

కె.మహేందర్, సత్యం న్యూస్

Related posts

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

Satyam NEWS

హైకోర్టు తీర్పుతో ఆనందోత్సాహాలలో ఉండవల్లి వాసులు

Satyam NEWS

ఆశ్రమాలకు నిత్యావసరాలు అందించిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ

Satyam NEWS

Leave a Comment