వేలకోట్ల రూపాయల బ్యాంక్ఎ రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయాడనే ఆరోపణలున్నలిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంక్ లు తమ డబ్బులు వందకు వంద శాతం వెనక్కి తీసుకోవాలంటూ భారత్‌లోని బ్యాంకులను కోరాడు. విచారణ లో భాగం గా లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ముందు హాజరయ్యాడు. అనంతరం మాల్యా మాట్లాడుతూ తనకు బ్యాంకు లు ఇచ్చిన రుణం లో అసలులో వందకు వంద శాతాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నాడు.
తీసుకున్న రుణాలను చెల్లించలేదని మాత్రమే బ్యాంకులు ఈడీకి ఫిర్యాదు చేశాయని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తానెటువంటి నేరాలకు పాల్పడలేదని స్పష్టం చేశాడు. అయితే, ఈడీ మాత్రం తన ఆస్తులను జప్తు చేసిందని మాల్యా ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే రకమైన ఆస్తుల కోసం ఓ వైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయని పేర్కొన్న మాల్యా బ్యాంకులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవాలని కోరాడు.తానూ విచారణ పేరిట అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయన ఆవేదన వ్యక్తం చేశారు.