ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్ళిచేసుకుని జాం జాం అంటూ బారాత్ మొదలు పెట్టారు.సన్నిహితుల కుటుంబ సభ్యుల స్నేహుతుల నృత్యాల కోలాహలం కానీ టీ తాగుతానని వెళ్లిన పెళ్ళికొడుకు చెట్టుకు ఉరేసుకుని శవమై తేలాడు.ఈసంఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.పెట్రోలు బంకులో పనిచేసే దుష్యంత్ గిరి అనే యువకుడి విషాదగాథ అందరిని కలిచి వేసింది.
పెళ్లయి కొన్ని గంటలే గడుస్తున్నా అప్పటి దాకా తన తో ఉన్నతన భర్త మృతి వెనుక ఏదో కుట్ర ఉందని నవ వధువు ఆరోపిస్తోంది. అతని మృతదేహాన్ని చూసి వధువు గుండెలు అవిసేలా రోదించింది. దుష్యంత్ ఉరి వేసుకుని చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని పోలీసులు చెప్పారు. వధువును ఆమె పుట్టింటికి పంపించామని, ఆత్మహత్యకు కారణాలేంటో తెలుసుకోడానికి విచారణ జరుపుతామని చెప్పారు.