40.2 C
Hyderabad
May 1, 2024 17: 06 PM
Slider హైదరాబాద్

వీబీజీ సేవలను విమర్శించడం సిగ్గుచేటు

#vbg

వీబీజీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ పట్ల కొంత మంది విమర్శలు చేయడం వారి అవివేకానికి, సంకుచిత బుద్ధికి నిదర్శనమని వీబీజీ వ్యవస్థాపకులు టిఎస్వీ ప్రసాద్, మడిపడిగ రాజు, ఎస్.శ్రీహరిలు అన్నారు. కాచిగూడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమాజంలో వీబీజీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కొంత మంది వీబీజీ పట్ల దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటని అన్నారు.

కరోనా కష్ట కాలంలో వేలాది మందికి అన్నదానం, మందుల పంపిణి, అవసరమైన పేదలకు బట్టల పంపిణి, మహిళల స్వయం ఉపాధికి కుట్టుమిషన్లను పంపిణి చేయడం జరిగిందన్నారు. నిరుపేద విద్యార్థుల చదువు కోసం ఫీజులను చెల్లించి వారి ఉన్నత విద్యకు తోడ్పాటు నందించామని తెలిపారు. ఇలా సమాజ సేవ చేస్తుంటే కొంతమంది పనిగట్టుకొని, వాస్తవాలను తెలుసుకోలేక విమర్శలు చేయడం తగదన్నారు.

ఏ ఒక్కరికి కూడా ఏలాంటి సహాయం చేయని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారని, ఆలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంతింతై వుడికిన అన్న విధంగా వీబీజీ అనతికాలంలోనే మహా వృక్షమైందని, ఈ మహా వృక్షం కింద లక్షలాది మంది సేవలు, ఉద్యోగ, ఉపాధి, వ్యాపరాభివృద్ధి పొందుతున్నారని తెలిపారు. వీబీజీ పట్ల ఎవరెన్ని ఆరోపణలు చేసినా, వారి ఆరోపణలే మాకు దీవెనలుగా భావించి సంస్థ అభివృద్ధికి, మరిన్ని ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తామని వారు ప్రకటించారు.

Related posts

గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇప్పిస్తాం : సీఎం కేసీఆర్‌

Satyam NEWS

రీసర్వే కు ముందు గ్రామాలలో ఫీల్డ్ పిఓఎల్ఆర్

Bhavani

మంగళగిరి అసెంబ్లీ స్థానంలో భగ్గుమన్న విభేదాలు

Satyam NEWS

Leave a Comment