40.2 C
Hyderabad
May 6, 2024 17: 56 PM
Slider కరీంనగర్

కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం – ఆది శ్రీనివాస్

#vemulawada congress adhi

ప్రభుత్వం యొక్క ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన పెంచాలి

ఆక్సిజన్ సరఫరా తో పాటు రెమిడీ సివర్ మరియు మందులను కరోనా బారిన పడిన వారికి అందించాలి

అంబులెన్సుల కొరత ఏర్పడుతున్నది, మండలానికి కనీసం 2 చొప్పున అంబులెన్సుల సౌకర్యాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.

ప్రతి మండల కేంద్రానికి 50 పడకల కోవిడ్ ఆసుపత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలి.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

టీ పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్

కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టిపిసిసి కార్యదర్శి వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆయన మాట్లాడుతూ కరోనా రెండవ దశలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం ఎంతగానో కిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రభుత్వాల నిర్లక్ష్యం ధోరణి వల్ల ఇలా జరుగుతున్నాయని ఆయన అన్నారు. మొదటి దశలో కరోనా రూపంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అది ఒక గుణపాఠం లా తీసుకొని ఉండి ఉంటే రెండో దశలో కరోన ఇంత తీవ్రత కాకుండా ఉండు నేమో ఇది ముమ్మాటికీ ప్రభుత్వాల వైఫల్యం ఇప్పటికైనా దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరింత ప్రాణనష్టం జరగకముందే ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్, మేడి సివర్, మందుల కొరతను తీర్చాలని ఆయన అన్నారు. ప్రజలను పట్టించుకోకుండా ఎవరి చేతులు వారి పైన పెట్టడం శోచనీయమని ఆయన అన్నారు. కోవిడ్ మరణాలు రోజురోజుకు అధికమవుతున్నాయి ఈ తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సబబు అని ఆయన అన్నారు. గతంలో వచ్చిన కరోనాను చిన్న చిన్న దేశాలు గుణపాటం గా తీసుకొని ప్రస్తుతం రెండవ దశలో కరోనా మహామారి ని దీటుగా ఎదుర్కొంటే ఇక్కడ ప్రాణ నష్టం చూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. గతంలో కూడా డెంగ్యూ వచ్చి అధికశాతం నిరుపేదలు లక్ష రూపాయల వరకు ఆస్పత్రిలో ఖర్చు చేశారని అప్పుడు కూడా రాజీవ్ ఆరోగ్య శ్రీ లో చేర్చ లేరని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కరోనా వల్ల అనేక కుటుంబాలు చితికిపోయయీ అనేకమంది ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు దొరక ప్రవేట్ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి వెంటనే కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలకు భరోసా ప్రజా ఆరోగ్యం లో నష్టపోయిన వారికి గుర్తించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆది శ్రీనివాస్ అన్నారు

Related posts

జైలు నుంచి విడుదలైన టీడీపీ నేతకు సంఘీభావం

Satyam NEWS

చిరుధాన్యాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ

Bhavani

ఎర్ర చందనం స్మగ్లర్ భాస్కరన్ పై పిడి చట్టం

Satyam NEWS

Leave a Comment