శ్రీమతి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు, అనువంశిక అర్చక సమాఖ్య ,వేములవాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా వేములవాడ ఎం. ఎల్. ఏ రమేష్ బాబు పంపిణీచేశారు. గురువారం జవహార్ లాల్ నెహ్రూ విద్యాసంస్థల అద్వర్యం లో ముందు జాగ్రత్త చర్యగా ఉచిత హోమియో మందును అయన స్థానికులకు అందజేశారు.
ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ఈ ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలియ జేశారు.కరోనా వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని అయన కోరారు. దాదాపు రెండు వేల మందికిఉచిత హోమియో మందు చేరాలన్న ఉద్దేశ్యంతో తెప్పించడం జరిగిందని నిర్వహకులు ఈశ్వరగారి రమణ ,నరహరి శర్మ లు తెలిపారు .ఈ కార్య క్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ ,స్థానిక బ్రాహ్మణా సంగం నాయకులు పాల్గొన్నారు.