సవతి తల్లిని, చెల్లిని చంపేస్తే ఆస్తి తనదౌతుందనుకున్నాడు ఒక కొడుకు. ఇద్దర్ని చంపితే నేరస్తుడు అవుతాడు కానీ ఆస్తికి వారసుడు అవుతాడా? ఇంత చిన్న లాజిక్ మర్చిపోయిన హరీష్ అనే వాడు సవతి తల్లిని, చెల్లిని చంపేశాడు. సూర్యాపేట మండలం తాళ్ళ ఖమ్మం పహాడ్ గ్రామం లో ఈ దారుణం చోటు చేసుకొంది.
కొద్ది రోజులుగా హరీష్ కుటుంబంలో ఆస్తి కోసం తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మారు తల్లి అంజమ్మ, చెల్లెలు మౌనికను కొడుకు హరీష్ రోకలి బండతో మోది దారుణంగా హత్య చేసాడు. చెల్లి స్పాట్ లోనే మృతి చెందగా, మారు తల్లి సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో మృతి చెందింది.