33.2 C
Hyderabad
May 4, 2024 00: 21 AM
Slider నిజామాబాద్

తిమ్మాపూర్ శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

#kcr

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు (తిమ్మాపూర్) లో వేంచేసి ఉన్న “శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి” వారి 8వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేడు జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు.

ఆలయ ధర్మకర్త, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులు, పాలకమండలి సభ్యులు, భక్తులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, MP లు కేఆర్ సురేష్ రెడ్డి, బిబీ  పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, ఎ జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, శాసనమండలి సభ్యులు విజీ గౌడ, రాజేశ్వరరావు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ రాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, SP బి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా బాన్సువాడ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన సతీమణి శోభ, రాజ్యసభ సభ్యులు జే. సంతోష్ కుమార్,పార్లమెంట్ సభ్యులు బిబీ పాటిల్ వచ్చేశారు. బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందించి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి , ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా దేవాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి అలిపిరి వద్ద పైలాన్ ను ఆవిష్కరించారు.

తరువాత దేవాలయం చేరుకున్న ముఖ్యమంత్రి, దాతలు, భక్తులు సమర్పించిన 2 కిలోల స్వర్ణ కీరిటాన్ని స్వామి వారికి సమర్పించారు. అనంతరం కన్నుల పండుగగా జరిగిన “శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి” వారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను స్పీకర్ పోచారం దంపతులు నూతన పట్టు వస్త్రాలతో సన్మానించారు. శ్రీ వెంకటేశ్వర దేవాలయం తరుపున స్వామి వారి విగ్రహ జ్ఞాపికను ముఖ్యమంత్రి బహుకరించారు.

జి. లాలయ్య సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

అధ్వాన్న దశలో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మంత్రిత్వ శాఖ

Satyam NEWS

చింతలపూడి టీడీపీ అభ్యర్ధిపై విస్తృత చర్చ

Satyam NEWS

బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

Bhavani

Leave a Comment