31.7 C
Hyderabad
May 7, 2024 01: 28 AM
Slider ముఖ్యంశాలు

తొలిమెట్టు సమర్ధంగా వుండాలి

#vakatikaruna

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని , తొలిమెట్టు ను జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని  రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమం అమలుపై  హైదరాబాద్ నుంచి  విద్యాశాఖ పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో  ప్రాథమిక దశలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని, 75% మంది విద్యార్థులకు పూర్తి స్థాయి ప్రమాణాలు ఉండటం లేదని, జాతీయ సర్వే ప్రకారం దేశంలో చివరి నుండి 3వ స్థానంలో మనం ఉన్నామని తెలిపారు. దేశంలో అనేక రంగాలలో ముందు వరుసలో ఉన్న మన రాష్ట్రం విద్యా ప్రమాణాలో సైతం మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో, పిల్లల కనీస ప్రమాణాలుపై శ్రద్ద తో తొలిమెట్టు కార్యక్రమం రూపొందించామని ఆమె అన్నారు. ప్రాథమిక స్థాయి పిల్లలకు అక్షరాలను గుర్తించడం,  చిన్న చిన్న వ్యాసాలు చదవడం, బేసిక్ మాథ్స్ తదితర అంశాల పై పిల్లలను భాగస్వామ్యం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో  బోధన జరిగే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ లకు ఆమె సూచించారు.

తొలిమెట్టు శిక్షణ పూర్తి

తొలిమెట్టు అమలుకు సంబంధించి 223 జిల్లా ఆర్.పి. (రిసోర్స్ పర్సన్స్), 2818 మండల ఆర్.పీ లకు, 48 వేల ప్రాథమిక దశ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించామని,  600 పైగా సీనియర్ ప్రధానోపాధ్యాయులకు తొలిమెట్టు మండల నోడల్ అధికారులుగా బాధ్యతలు అప్పగించామని , అక్టోబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక  విద్యార్థులను పరిక్షించి ప్రస్తుత సామర్థ్యాన్ని యాప్ లో పిల్లల ఆధార్ నెంబర్ ల వారిగా నమోదు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో కలెక్టర్ లు ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో తొలిమెట్టు  పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థుల ప్రమాణాలను, పురోగతిని పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

ప్రతిరోజు పాఠశాలలో తొలిమెట్టుకు సంబంధించి తరగతులను తీసుకునే విధానంలో మార్పులు రావాలని, పిల్లలను ఆకట్టుకునే విధంగా తరగతులు నిర్వహించాలని అన్నారు. ప్రతిరోజు పిల్లలు చదివే విధంగా చర్యలు తీసుకోవాలని,  పాఠశాలలో ప్రత్యేకంగా రీడింగ్ పిరియడ్ ఉండాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లా నుంచి గ్రంథాలయాల ఏర్పాటు కోసం 150 నుండి 200 పాఠశాలలను గుర్తించాలని కలెక్టర్ లను ఆమె ఆదేశించారు.  గ్రంధాలయాల్లో పిల్లల పరిజ్ఞానం పెంచే విధంగా కథలు పుస్తకాలు,  బేసిక్స్ అధ్యయన పుస్తకాలు అందుబాటులో పెడతామని అన్నారు.

నవంబర్ చివరి నాటికి పాఠశాలల్లో గ్రంథాలయాలను సిద్దం చేయాలని సూచించారు. రంగారెడ్డి, హైదరాబాద్  మేడ్చల్ జిల్లాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు సైతం భాగస్వామ్యం చేస్తూ పిల్లల ప్రమాణాలు పెంచే విధంగా ప్రణాళిక తయారు చేసామని అన్నారు. 14 జిల్లాలో మెట్రో విధానం ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదు చేస్తున్నామని , మిగిలిన జిల్లాలో సైతం త్వరలో అమలు చేస్తామని అన్నారు.

ప్రైవేటు పాఠశాలల కంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యాప్రమాణాలు,  అనుభవం కల్గిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మార్చి 2023 నాటికి ప్రాథమిక విద్యా ప్రమాణాలో విప్లవాత్మక మార్పులు సాధించాలని సూచించారు. అనంతరం రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలు చేసి మంచి ఫలితాలు సాధించిన నమునాలను వివరించారు.

Related posts

ఘనంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబా విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS

మ్యాట్  ల్యాబ్ లో  అధ్యాపకులకు  శిక్షణ కార్యక్రమం

Satyam NEWS

తిరుపతిలో ఈ నెల 30న గో మహాసమ్మేళనం

Satyam NEWS

Leave a Comment