39.2 C
Hyderabad
May 3, 2024 13: 02 PM
Slider విజయనగరం

విజయన‌గ‌రంలో మ‌రోసారి ప్ర‌తాపం చూపించిన ఖాకీలు…!

#vijayanagarampolice

విద్య‌ల నగ‌ర‌మైన విజ‌య‌న‌గరం మ‌రోసారి ఖాకీల ప్ర‌తాపాన్ని చ‌వి చూసారు…విద్యార్దులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం చేరుతూ ఎస్ఎఫ్ఐ  ఆధ్వర్యంలో న‌గ‌రంలోని బాలాజీ జంక్షన్ వద్ద విద్యారంగ పరిరక్షణ యాత్ర చేప‌ట్టారు.ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచీ  ర్యాలీగా బ‌య‌లుదేరిన విద్యార్దులను…ఆచంట గార్డెన్ వ‌ర‌కు సాపీగాసాగింది…వారి ప‌రిర‌క్ష‌ణ యాత్ర‌. అయితే ఒక్కసారిగా  బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద‌ వారి ప‌రిక్ష‌ణ యాత్ర‌ను అడ్డుకున్నారు…పోలీసులు.అంత‌కుమందే స‌మాచారం అందుకున్న టూటౌన్, వ‌న్ టౌన్ పోలీసులు..బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద  విద్యార్ధుల‌ప‌రిర‌క్ష‌ణ యాత్ర కై నిరీక్షించారు.అయితే బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద‌కు విద్యార్దుల ప‌రిర‌క్ష‌ణ యాత్ర చేరుకోగానే…ఒక్క‌సారి పోలీసులు…వారి యాత్ర‌ను అడ్డుకున్నారు. న‌గ‌రంలోని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఉండ‌గానే…ఎలాంటి యాత్ర‌లు…నిర‌స‌న‌లు..ర్యాలీలు జ‌ర‌ప‌కూడ‌దంటూ..పోలీసులు…ఆ యాత్రను అడ్డుకున్నారు. ఈమేర‌కు టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ‌రావు, వ‌న్ టౌన్  ఎస్ఐలు సూర్యనారాయ‌ణ‌,అశోక  కుమార్ లతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో విద్యార్దుల‌ను అడ్డుకున్నారు. ప‌రిర‌క్ష‌ణ యాత్ర చేప‌ట్ట‌కూడ‌దంటూ…వారి యాత్ర‌ను అడ్డుకుని విద్యార్ధులంద‌రినీ…సీఐ  త‌న జీపులో ఎక్కించి స్టేష‌న్ కు త‌ర‌లించారు.దీంతో విద్యా్ర్ధులు..పోలీసుల జులుం నిశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు..భారీ గా ట్రాఫిక్ స్తంభించింది.కాగా కొంత‌సేప‌టికి విద్యార్ధుల‌ను అక్క‌డ నుంచీ త‌ర‌లిచండంతో..అంతా సాపీగా జ‌రిగిపోయింది.

Related posts

శ్రీ వేంకటేశ్వరా నీకు ఇంత పక్షపాతమేల స్వామీ?

Satyam NEWS

సేవ్ అమరావతి:శ్రమదానంతో రాజధాని నిర్మిస్తాం

Satyam NEWS

డాక్టర్ రెడ్డీస్ నుంచి రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది

Satyam NEWS

Leave a Comment