22.2 C
Hyderabad
December 10, 2024 10: 27 AM
Slider ఆంధ్రప్రదేశ్

శ్రీ వేంకటేశ్వరా నీకు ఇంత పక్షపాతమేల స్వామీ?

IMG-20170820-WA0008

డాలర్ శేషాద్రి- ఈ పేరు చెబితే తిరుమల తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా గజ గజ వణికి పోతాడు. డాలర్ శేషాద్రి లేనిదే శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎలాంటి సేవలు జరగవు. ఏ వీఐపి కూడా రాడు. దర్శనం చేసుకోడు.- ఇదే టాక్ చాలా కాలంగా కొండపై వినిపిస్తున్నది. ప్రభుత్వాలు మారినా డాలర్ శేషాద్రి మాత్రం కొండపైనే ఉంటాడు. బహుశ కలియుగ అంతం వరకూ డాలర్ శేషాద్రి అక్కడే ఉంటాడేమో తెలియదు. 2006 సంవత్సరంలో పదవి విరమణ చేసిన డాలర్ శేషాద్రి కొండను వీడలేదు. ఆయన పలుకుబడి రోజు రోజుకూ పెరుగుతున్నదే తప్ప దగ్గడం లేదు. ప్రభుత్వాలు మారతాయి, ఇవోలు మారతారు, టిటిడి చైర్మన్ లు మారతారు కానీ డాలర్ శేషాద్రి మాత్రం పర్మినెంటు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా డాలర్ శేషాద్రి కొనసాగుతూనే ఉంటారని ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కూడా రుజువు చేసేసింది. డాలర్ శేషాద్రి సేవలు వద్దు అని ఆ వేంకటేశ్వరుడి నుంచి ముఖ్యమంత్రి వరకూ ఎవరూ చెప్పలేకపోతున్నారు. చివరకు దాదాపుగా వంద మందిని టిటిడి తీసేయాలని నిర్ణయించుకున్న ఈ సమయంలో కూడా డాలర్ శేషాద్రి కంటిన్యూ కాబోతున్నారని సమాచారం ఉంది. ఏమిటి డాలర్ శేషాద్రికి ఉన్న శక్తి, మహిమ అని తరచి తరచి చూస్తే చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి నుంచి పక్క రాష్ట్ర సిఎం వరకూ డాలర్ శేషాద్రి ని తీసేయవద్దని జగన్ కు చెప్పిఉంటారు అందులో విచిత్రం ఏమీ లేదని అంటున్నారు. టిటిడి బోర్డు నూతన చైర్మన్ సుబ్బారెడ్డి నుంచి అందరూ డాలర్ శేషాద్రి లేనిదే శ్రీ వేంకటేశ్వర స్వామి ముద్ద కూడా ముట్టడని చెబుతున్నారట. ఇవో సింఘాల్ నుంచి జేఈవో ధర్మారెడ్డి వరకూ కూడా డాలర్ కే ఓటు వేస్తున్నారట. ఇంత మందిని కాదని అల్ పవర్ ఫుల్ ముఖ్యమంత్రి అయినా సరే జగన్ చేయగలిగింది ఏమీ లేదని అంటున్నారు. అందుకే ఆగమేఘాలపై డాలర్ శేషాద్రి ని కొనసాగించే ఫైల్ కదిలిందట. నేడో రేపూ అన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చి డాలర్ శేషాద్రిని కొనసాగిస్తారని అంటున్నారు. వేంకటేశ్వరా, నిజంగానే నీవు డాలర్ శేషాద్రి లేకపోతే ఉండలేవా స్వామీ?

Related posts

గీతా జయంతి సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత పోటీలు

Satyam NEWS

బిజెపి జాతీయ నాయకురాలు డికె అరుణ అరెస్టు

Satyam NEWS

సీఎం జగన్ తో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే స్వామి భేటీ

Satyam NEWS

Leave a Comment