36.2 C
Hyderabad
May 14, 2024 18: 31 PM
Slider ప్రత్యేకం

పోలీసుల అదుపులో ర‌వి జ్యూయ‌ల‌రీ షాపు చోరీ నిందితుడు…!

#vijayanagarampolice

ముందుగానే స‌త్యం న్యూస్.నెట్…చెప్పిన “స‌త్యం.”

ప్రస్తుత ఈ ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్ ల యుగంలో ప్ర‌తీదీ సంచ‌ల‌న‌మే…ప్ర‌తీ వార్త సెన్సేష‌న‌లే. స‌రిగ్గా రెండు రోజుల క్రితం…అంటే ఈ నెల 23 న  ఏపీలోని  విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని గంట‌స్థంబం వ‌ద్ద ఉన్న ర‌వి జ్యూయ‌లరీ షాపులో దొంగ‌త‌నం జ‌రిగి దాదాపు ఎనిమిది కేజీల బంగారం పోయింది.

ఇక ఆన్ లైన్  మీడియాలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న స‌త్యం న్యూస్.నెట్ కు విశ్వ‌నీయ‌వ‌ర్గాల ఇచ్చిన స‌మాచారంతో వెనువెంట‌నే ఆ జ్యూయ‌ల్లెరీ షాపు న‌కు వెళ్ల‌డం..ఎస్పీ,ఏఎస్పీ, క్లూస్ టీమ్స్ రావ‌డం…ద‌ర్యాప్తు ప్రారంబించ‌డం…వార్త‌ను ప్ర‌సారం చేసింది. ఆ మర్నాడే…ర‌వి జ్యూయెల్లరీ చోరీ కేసులో నిందితుడు చ‌త్తీస్ ఘ‌డ్ వాసి లోకేష్ గా అనుమానం  అంటూ వార్త‌ను కూడా స‌త్యం న్యూస్.నెట్ ఇచ్చింది.

సీన్ క‌ట్ చేస్తే…

రెండు  రోజుల్లోనే సీసీఎస్ పోలీసులు…ఛ‌త్తీస్ ఘ‌డ‌లో నిందితుడు లోకేష్ ను ప‌ట్టుకోవ‌డం జ‌రిగింది. ఈ నెల 23 న నగ‌రంలోని గంట‌స్తఃబం వ‌ద్ద భారీ చోరీ జ‌రిగింద‌ని.. షాపు య‌జ‌మాని పోలీసులుకు ఫిర్యాదు చేయ‌డం..హుటాహుటిన క్లూస్ టీమ్స్ ను రంగంలోకి దించ‌డం..అతి పెద్ద దొంగ‌త‌నం.. .కోటిరూపాయ‌ల‌కుపైగా గోల్డ్ చోరీ కావ‌డంతో…కేసును వ‌న్ టౌన్ పోలీసులు క‌ట్టినా…ద‌ర్యాప్తు మాత్రం సెంట్ర‌ల్ క్రైమ్ పోలీసులు చేసి….రెండు  రోజుల వ్య‌వ‌ధిలోనే నిందితుడిని క‌ట‌క‌టాల వెన‌క్కి  పంపించారు.

ఈ మేరకు జిల్లా పోలీస్ కాన్ష‌రెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో  ఎస్పీ దీపిక మాట్లాడారు.వివ‌రాల్లోకి వెళితే..విజయనగరం రవి జ్యూవెలరీ షాపులో ఈ నెల 21న చోరీకి పాల్పడిన నిందితుడ్ని అతి కొద్ది గంట‌ల‌లోనే చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అరెస్టు చేసి, చోరీ మిస్టరీని చేధించినట్లుగా ఎస్పీ దీపిక, తెలిపారు.

విజయనగరం  కోళ్ళ బజారు దగ్గర గల రవి జ్యూవెలరీ షాపులో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి, షాపులో 8 కిలోల బంగారు ఆభరణాలు (ఒక కోటి 36 లక్షలు విలువ) పోయినట్లుగా షాపు యజమాని కోట రామ్మోహన్ ఫిర్యాదు చేసార‌ని… ఈ మేర‌కు వ‌న్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని ఎస్పీ తెలిపారు.. ఘ‌ట‌న జ‌రిగిన ఆ రోజునే ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించామ‌ని,సీసీఎస్  పోలీసులు, క్లూస్ టీం నేరస్థలంను సందర్శించి, నేరం జరిగిన తీరును

పరిశీలించి, సాంకేతిక, భౌతిక ఆధారాలను సేకరించి, ఈ నేరంకు పాల్పడింది ఇతర రాష్ట్రానికిచెందినిందితులుగా గుర్తించామ‌న్నారు. ఈ  మేర‌కు అదనపు ఎస్పీ అనిల్  ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి పంపామ‌ని ఎస్పీ తెలిపారు..ఆ  రాష్ట్రంలోరి కబీర్ధాం జిల్లా కవర్ధా పట్టణంకు చెందిన లోకేష్ శ్రీవాస్ అనే పాత నేరస్థుడిని చత్తీస్ ఘడ్ పోలీసుల సహకారంతో అతని ఇంటి వద్దనే అరెస్ట చేసామ‌న్నారు.

నిందితుని వ‌ద్ద నుంచీ 6. 181 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. త‌మ విచారణలో నిందితుడు లోకేష్ శ్రీవాస్ విజయనగరంలో మరో మూడు ప్రాంతాల‌లో దొంగ‌త‌నాల‌కు పాల్పడినట్లుగా అంగీక‌రించాడ‌ని ఎస్పీ తెలిపారు.  నిందితుని వ‌ద్ద‌ నుండి 90.52 గ్రాముల సిల్వర్ బ్రాస్ లెట్లును,  15 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.. అలాగే సీఎంఆర్, పాండు జ్యూవెలరీ షాపు మరియు పద్మజ ఆసుపత్రి మెడికల్ షాపులో చోరీలకు పాల్పడి, తన అవసరాలకు నిందితుడు డబ్బులను ఖర్చు చేసాడ‌ని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు.

మొద‌టి భార్య మృతి చెంద‌డంతో దొంగైన నిందితుడు

కాగా నిందితుడు లోకేష్ శ్రీవాస్ టెన్త్  చదివినట్లు, మొదటి భార్య అనారోగ్యంకు బాగా అప్పులు చేసి, వైద్యం చేయించినప్పటికీ 2014లో చనిపోవడంతో, వాటిని తిరిగి పొందేందుకు తన స్నేహితుల సూచనలతో చోరీలకు పాల్ప‌డిన‌ట్టు త‌మ  విచార‌ణ‌లో తేలింద‌ని జిల్లా ఎస్పీ అన్నారు.

ఇప్పటి వరకు ఒడిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడ‌ని… నిందితుడి జైలులో ఉన్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన ఒక నేరస్థుడితో పరిచయం ఏర్పడి, అతని సలహాతో విజయనగరానికి ఈ ఏడాది జనవరి 16న తొలిసారిగా వచ్చి పద్మజ ఆసుపత్రి లో చోరీకి పాల్పడ్డాడ‌ని తెలిపారు.అదే విధంగా ఈ నెల  14న మళ్ళీ మరోసారి వచ్చి సి.ఎం.ఆర్.లో చోరీకి పాల్పడ్డాడ‌ని…. ఫిబ్రవరి 21న మ‌ళ్లీ వచ్చి రెక్కీ నిర్వహించి, రవి జ్యూవెలరీ, పాండు జ్యూవెలరీ షాపుల్లో చోరీలకు పాల్పడ్డారన్నారు.

ప్రస్తుతం చత్తీస్ ఘడ్ లో సెలూన్ నడుపుకుంటున్నాడని, అతని రెండో భార్య బ్యూటీ పార్లర్ న‌డుపుతున్నట్లుగా విచారణలో వెల్లడయ్యిందని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.ఈ కేసుల్లో విజయనగరం వ‌న్ టౌన్ సీఐ జె.మురళి, సీసీఎస్ ఇన్స్ పెక్టర్లు సిహెచ్. శ్రీనివాసరావు, ఎస్. కాంతారావు, ఎస్ఐ వి. అశోక్ కుమార్, హెడ్ కాని స్టేబుళ్ళు డి. శంకర్రావు, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్, ఎం. అచ్చిరాజులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

విక్రమ సింహపురి యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ వర్థంతి

Satyam NEWS

ప్రేమించి మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

పారిశుధ్య కార్మికులను సన్మానించిన విహెచ్

Satyam NEWS

Leave a Comment