36.2 C
Hyderabad
May 15, 2024 17: 24 PM
Slider విజయనగరం

మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వారికి పోలీస్ చెక్

#swamy

శాంతి యుత విజయనగరం… మరోసారి… తన పేరు ను నిలబెట్టుకుంది. అదీ పోలీసులు చర్యలతో. మైనార్టీ మరియు మెజారిటీ వర్గాల్లో భేదభిప్రాయాలు లేకుండా అందరూ సమానమే అంటూ నిరూపించారు. వివరాల్లోకి వెళితే… గడచిన మూడు రోజుల నుంచే విజయనగరం కోట జంక్షన్ వద్ద ఉన్న దెంకే షా వలీ బాబ దర్గా విషయం మై నగరం లో రచ్చ జరుగుతోంది. రెండేళ్ల క్రితం ఉన్న దర్గాని పొడిగిస్తూ స్తం బాలు వేశారు. అప్పుడే అభ్యంతరాలు రావడం తో విరమించు కున్నారు. అయితే రెండు రోజుల క్రితం దర్గా కారుతొందని.. మళ్ళీ పునానిర్మించేందుకు పునుకుని ఉన్న దర్గాన్ని కూల్చారు. ఇదే అదనుగా హిందూ సంఘాలు రంగం లోకి దిగి అసలు దర్గా అన్నది ఆక్రమణ అని అసలు దర్గా ప్లానఏంటి అని అక్కడే ఆందోళన కు దిగారు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ విజయానంద్ ఘటన స్థలానికి వచ్చి… మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను రప్పించి.. కొలతలు తీసి సమస్య ను ఓ కొల్లిక్కి తీసుకొచ్చారు.

అయితే సాయంత్రం మళ్ళీ ఏడున్నర సమయానికి హిందూ సాధు పరిషత్ వక్త శ్రీనివాసనంద సరస్వతి స్వామి వచ్చి… దర్గా ను రోడ్డు కు అడ్డంగా తిరిగి ఎలా నిర్మిస్తారని బైఠాయించారు. దాదాపు రెండు గంటలకు పై గా దర్గా పక్కనే తమ నిరసన ను తెలియచేసారు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్ ఐ షేక్ శంకర్ వచ్చిన స్వామీజీ తమ ధర్నా విడవలేదు. విషయం తెలుసుకున్న సీఐ విజయానంద్.. రావడం తో గలాటా సర్దు మణిగింది. అంతకు ముందు…. కోట జంక్షన్ వద్ద దర్గా వద్దే ఒక వై పు   హిందువులు మరో వైపు ముస్లిం లు… ఎక్కడ గొడవ జరుగుతోందేమోనని పోలీసులు… ఇలా కోట జంక్షన్ వద్ద ఉద్రిక్తిత పరిస్థితి నెలకొంది. ఇలా దాదాపు గంటన్నర కు పైగా… పరిస్థితి ఆందోళన కరంగా మారడం తో అప్పుడు టూ టౌన్ సీఐ సిబ్బంది తో రావడం తో.. రెండు వర్గాలు చెరో వై పునకు వెళ్లిపోయాయి. అప్పుడు సీఐ… హిందూ సాధు పరిషత్ సభ్యుల తో చర్చించ డం తో… వాళ్ళు అక్కడ నుంచి వెళ్లి పోవడం తో… సమస్య సద్దు మణిగింది.

Related posts

విశాఖ నగరంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య

Satyam NEWS

విశాఖ విజయదుర్గా దేవి ఆలయంలో దోపిడి దొంగలు

Satyam NEWS

సిఎం జగన్ ను అమిత్ షా ఎందుకు కలవలేదో తెలుసా?

Satyam NEWS

Leave a Comment