37.2 C
Hyderabad
April 21, 2024 16: 37 PM
Slider జాతీయం

శ్రీ పెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు

#chandrababu

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శ్రీపెరంబుదూర్ లోని శ్రీరామానుజార్  దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు మరిచిపోలేను అన్నారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తాను అని చంద్రబాబు అన్నారు. ఎపి ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని, 5ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చంద్రబాబు అన్నారు. అందరి సహకారంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు.

Related posts

కొమురవెళ్లి మల్లన్న గుట్ట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Satyam NEWS

రైల్వేరంగంలో ఆదిలాబాద్ జిల్లాపై ప్రభుత్వాల వివక్ష

Satyam NEWS

మునావర్ ఫారూఖీ వంటి మూర్ఖుడిని తెలంగాణలో అడుగు పెట్టనీయం

Satyam NEWS

Leave a Comment