38.2 C
Hyderabad
May 3, 2024 19: 21 PM
Slider విజయనగరం

కరోన అలెర్ట్..నెటిజన్ల కు….ప్రజలు విజ్ఞప్తి..అది ఇదే…!

#VijayanagaramPolice

ఒకే ఒక్క రోజు… అదీ కర్ఫ్యూ సడలింపు సమయం ఎత్తి వేసే నాటికి పోలీసులు తమ ప్రతాపం ఏంటో చూపించారు.. ఏపీ రాష్ట్రంలో ని విజయనగరం ప్రజలకు. ఆది కాస్త..సోషల్ మీడియా పుణ్య మా యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. దీంతో చాలా మంది నెటిజన్లు పోలీసులను తిట్ల పురాణంతో దూషించారు కూడా. అయితే దీనిపై చాలా మంది స్పందిస్తూ.. ఒక్క రోజులో పోలీసులు ఎందుకు ఆలా ప్రవర్తించారో మనకి తెలియదా అంటూ.. మనకోసమే పోలీసులు అలా కచ్చితంగా విధులు నిర్వహించారంటూ కొంతమంది   పేర్కొనడం విశేషం.ఆ సారాంశం..ఇదే

ప్రజలారా! ఒక్కసారి ఆలోచించండి!!

పోలీసుల ఓవరాక్షన్ అంటూ ఒక్క రోజు కఠినంగా పట్టణంలో కర్ఫ్యూ అమలు చేస్తే విమర్శలు చేస్తున్నారు. మరి వారి కుటుంబాలు వదిలి, తీవ్ర ప్రభావం గల కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలని ఆలోచించరా? 12 గంటల తర్వాత కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి ఒక పావు గంట ట్రాఫిక్ జామ్ లో ఉంటే.. సొమ్మసిల్లి పోయారంటున్నారు. మరి మండుటెండలో ఇరుకు రోడ్లలో గంటల తరబడి ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసుల గురించి ఎప్పుడైనా… ఆలోచించారా?

కరోనా వైరస్ ఈసారి ఎంతోమందిని మన నుండి తీసుకువెళ్ళి పోయింది. మిగిలిన వారినైనా ఈ వైరస్ నుండి రక్షించాలన్న తాపత్రయంలోనే పోలీసులు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారన్న విషయాన్ని పౌరులుగా మనం అర్థం చేసుకోలేమా?ప్రజల ఆరోగ్యం, క్షేమం కోసమే పోలీసులు అని అర్థం చేసుకుని, ఇళ్లకు పరిమితమై కర్ఫ్యూ నిబంధనలు పాటించడం మనందరి బాధ్యత కాదా?

నిత్యం ప్రజల కోసం పాటుపడే పోలీసులను గౌరవించడం మన కర్తవ్యం కాదా? ఇళ్లకే పరిమితమవుదాం. కర్ఫ్యూ నిబంధనలు పాటిద్దాం పోలీసులకు సహకరిద్దాం..చట్టాన్ని గౌరవిద్దాం..కరోనా వైరస్ ను తరిమి కొడదాం అంటూ నెటిజన్ల తో పాటు అందులో పోలీసులు ఉండటం మరింత విశేష మంటోంది…సత్యం న్యూస్.నెట్.

Related posts

తొలిసారిగా రామానంద్ సాగర్ రామాయణం తెలుగులో

Satyam NEWS

భారీగా కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం

Satyam NEWS

తెలంగాణ సీఎంతో కంచి కామకోటి పీఠం ధర్మాధికారి భేటీ

Satyam NEWS

Leave a Comment