ఓ వైపు జేడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ లలో ఓట్ల లెక్కింపు ను క్షణక్షణం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి నేతృత్వంలో రెవిన్యూ యంత్రాంగం పర్యవేక్షిస్తుంటే మరో వైపు జిల్లా ఎస్పీ దీపికా.. ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది ని దగ్గరుండీ అదీ ప్రత్యక్షంగా ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద శాఖా సిబ్బంది చేస్తున్న బందోబస్తు ను ఎస్పీ పరిశీలిస్తున్నారు.
జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ లో జరుగుతున్న కౌంటింగ్ ను పరిశీలించిన ఎస్పీ దీపిక అక్కడ నుంచీ గజపతినగరం ,రామభద్రపురం లలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఇక పార్వతీ పురం బొబ్బిలి లో ఓఎస్డీ సూర్యచంద్రరావు ,డీఎస్పీ లు సుభాష్ ,అనిల్ ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ని పర్యవేక్షిస్తున్నారు.
ఇక పార్వతీపురం, డివిజన్ లోని గరుగుబిల్లి ,కురుపాం,చినమేరంగి లలో ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రంను ఓఎస్డీ ఎన్.సూర్యచంద్ర రావు సెప్టెంబరు 19న సందర్శించి, భద్రతను పర్యవేక్షించి, కౌంటింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన చర్యలు గురించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్