న్యూమాంక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ ఎస్ ఎం కమాల్ బాషా చీఫ్ ఆర్గనైజర్ గా జాతీయ స్థాయిలో చిలకలూరిపేట లోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు కుంగ్ ఫు కరాటే ఓపెన్ ఛాంపియన్ షిప్ 2021వ సంవత్సరానికి గానూ జరగనుంది.
నవంబర్14న జరిగే టోర్నీకి సంబంధించిన బ్రోచర్ ను ముందస్తుగా 19.09.2021 చిలకలూరిపేట మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు. బ్రోచర్ ను ఆవిష్కరించారు.
అనంతరం గ్రాండ్ మాస్టర్ ఎస్ ఎం కమాల్ భాషా ను దుశ్శాలువతో సత్కరించారు. రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మరియు న్యూ మాంక్స్ కుంగ్ ఫు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెన్నంశెట్టి చక్రపాణి ని కూడా సత్కరించారు. కార్యక్రమానికి టోర్నమెంట్ చీఫ్ ఇంఛార్జి కె శ్యాంబాబు అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నిడమానూరి సాంబశివరావు,పద్మనాభ రావు, డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ నేత అవ్వారు సత్యనారాయణ, కౌన్సిలర్ రజాక్, ఆస్మా మరియు కుంగ్ ఫు మాస్టర్స్ డి శ్రీనివాస్, జి రూఫస్ పాల్,ఎస్ దుర్గా రావు,షేక్ కరిముల్లా, చంద్ర, కరిముల్లా,శ్రీకాంత్, సుభాని, పుల్లారావు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.