40.2 C
Hyderabad
April 26, 2024 12: 03 PM
Slider మహబూబ్ నగర్

ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థులకు త్రీ ఆర్స్ ఎంతో ఉపయోగం

#deonagarkurnool

కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో దాదాపు 500 రోజుల పాటు విద్యార్థులు పాఠశాలలకు దూరమవ్వడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యం తగ్గింది. విద్యా సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం ఈనెల 20 నుండి 30 రోజుల పాటు విద్యార్థులకు త్రీ ఆర్స్ పై ప్రత్యేక శిక్షణను ప్రారంభించనున్నారు.

ఈ శిక్షణలో విద్యార్థులకు ఆంగ్లం, గణితం, తెలుగు, ఉర్దూ భాషల్లో వివిధ అంశాలను వివరిస్తారు. తెలుగు ఇంగ్లీషు ఉర్దూ రాయడం, చదవడం, గణితంపై శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ 3వ తరగతి విద్యార్ధుల నుంచి 8 వ తరగతి విద్యార్థుల వరకూ ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లాస్థాయిలో 825 పాఠశాలలు ఉండగా వాటిలో విద్యాసనాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో 566 ప్రాథమిక, 128 ప్రాథమికోన్నత, 131 ఉన్నత, మరో 20 కేజీబీవీ,2 ఆదర్శ, రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయి. 3 తరగతి నుండి 8 తరగతి వరకు విద్యను అభ్యసించే వారు 48,126 మంది ఉన్నారు. వారికి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మ్యాథ్స్‌లో బోధించే అనుభవజ్ఞులైన 3169 మంది ఉపాధ్యాయులకు గతంలోనే శిక్షణ ఇచ్చారు.

శిక్షణలో భాగంగా వారికి త్రీ ఆర్స్‌పై మెళకువలు నేర్పించారు. సోమవారం నుండి అన్ని పాఠశాలల్లో మూడవ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థుల ఆయా మాధ్యమాలలో సామర్థ్యాల ఫ్రీ టెస్ట్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారి గోవిందరాజులు శనివారం జూమ్ మీటింగ్ ద్వారా ఆదేశించారు.

జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారుల తో పాటు 57 స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు జిల్లా స్థాయి నుండి సెక్టోరల్ అధికారులు జిల్లాలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు తెలుగు ఆంగ్లం ఉర్దూ గణితం లో పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యాలను తరగతి వారీగా నమోదు చేశారా లేదా అన్ని వివరాలను పరిశీలించేందుకు పర్యవేక్షణ చేయాలని జిల్లా విద్యా శాఖ నుండి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం నుండి అన్ని పాఠశాలల్లో ఒక్కొక్క గ్రూపులో 20 నుండి 30 మంది విద్యార్థులను చేర్పించి, ప్రత్యేక విద్యాబోధన చేస్తారు. రోజు ఒకటి నుండి ఐదు పీరియడ్‌ వరకు ఆయా సబ్జెక్టుల్లో బోధించి 6,7,8 పీరియడ్‌లలో ప్రభుత్వం నిర్ధేశించిన ప్రణాళిక ప్రకారం త్రీ ఆర్స్‌పై విద్యార్థుల్లో అభ్యసనాభివృద్ధి కార్యక్రమాన్ని చేపడ్తారు. త్రీ ఆర్స్‌ నుండి 9, పదో తరగతి విద్యార్థులను మినహాయించారు. ఆయా విద్యార్థులకు సామర్థ్యాలకు అనుగుణంగా బోధనలు చేపట్టాలని సబ్జెక్టు ఉపాధ్యాయులకు సూచించామని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు తెలిపారు.

అదేవిధంగా జిల్లా స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుపై జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీలు బాధ్యత వహించనున్నట్లు ఆయన వివరించారు.

త్రీ ఆర్స్ గతంలో జిల్లాలో అమలు చేసినప్పటికీ ఇప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో అమలు చేయడం జరుగుతుందని, విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఉపాధ్యాయుడు పరిస్థితులను అర్థం చేసుకొని తప్పనిసరిగా జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుపరచాలని డీఈవో గోవిందరాజులు చెప్పారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

గ్రామ గ్రామాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగుర వేద్దాం

Satyam NEWS

గిరిజనులకు అండగా నిలిచేందుకు మెగా వైద్య శిబిరం

Satyam NEWS

వివేకానంద హత్య కేస్ లో సునీల్ యాదవ్ రిమాండ్ పొడిగింపు…

Satyam NEWS

Leave a Comment