27.7 C
Hyderabad
April 30, 2024 10: 20 AM
Slider విజయనగరం

ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు లాడ్జిలో బస చేస్తే వివరాలు తెలపాలి

#police

విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో గల లాడ్జి యజమానులతో 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు స్టేషనులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ బి.వెంకటరావు మాట్లాడుతూ – లాడ్జి రికార్డులు క్షుణ్ణంగా వ్రాయాలని, బస చేస్తున్న వారి ఆధార్ కార్డు, వారు ఎక్కడ నుండి వచ్చినది, ఏ పని మీద వచ్చినది, ఎన్ని రోజులు లాడ్జిలో ఉంటున్న వివరాలు రికార్డుల్లో తప్పనిసరిగా వ్రాయలన్నారు.

లాడ్జిలో బస చేస్తున్న వారి ప్రవర్తనలో అనుమానం ఉంటే వెంటనే స్టేషనుకు సమాచారం అందించాలన్నారు. లాడ్జిలో భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రతీ లాడ్జిలో బస చేయడానికి వచ్చిన వ్యక్తులు కనబడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తులు గంజాయితో తరుచూ పట్టుబడుతున్నందున ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ గారి ఆదేశాలతో లాడ్జిలపై మరింత నిఘా పెంచుతున్నామన్నారు. లాడ్జి యజమానులు పోలీసుశాఖ కు సహకరించాలని, అనుమానితుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసుశాఖ కు అందించాలని సిఐ బి.వెంకటరావు లాడ్జి యజమానులను కోరారు.

నాలుగు దొంగతనం కేసుల్లో ముగ్గురు నిందితులు అరెస్ట్

విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో ఇటీవల జరిగిన నాలుగు దొంగతనం కేసుల్లో ముగ్గురు నేరస్తులను అరెస్టు చేసినట్లుగా 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు  అరెస్టు చేసిన నిందితుల్లో (1) కొనిసి వీధికి చెందిన పట్నాన సత్తిబాబు (2) ధర్మపురి గ్రామానికి చెందిన మలిచర్ల సత్తిబాబు (3) లంకాపట్నంకు చెందిన పీతల చిన్న ఉన్నారన్నారు. నిందితుల వద్ద నుండి నాలుగు కేసుల్లో  1.40 లక్షల విలువైన స్ట్రీట్ లైట్లు, బల్బులు, ఇనప సామాన్లు, నట్లు, బోల్టులు, 11 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ బి. వెంకటరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు వి.అశోక్ కుమార్, ఐ. దుర్గా ప్రసాద్, హెచ్ సిలు అచ్చిరాజు, రమణ పాల్గొన్నారు.

Related posts

హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ 1 చిత్రం ప్రారంభం !

Bhavani

సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ 2023 జనవరి లో సెట్స్ పైకి

Bhavani

తమిళనాడును నలిపేస్తున్న మర్కజ్ జమాత్

Satyam NEWS

Leave a Comment