29.7 C
Hyderabad
April 29, 2024 09: 19 AM
Slider నల్గొండ

చెవిలో పూలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన

#hujurnagar

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయని మునిసిపల్ అధికారుల చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు చెవిలో పూలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు.

పట్టణ ప్రజలు తమ న్యాయ పోరాటానికి అండగా నిలవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, జక్కుల వీరయ్య తదితరులు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే వార్డు అభివృద్ధికి ప్రతి కౌన్సిలర్ సుమారు 30 లక్షల రూపాయల పని చేయవచ్చని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు కేటాయించిన నిధులు నేటి వరకు సుమారు 6 కోట్ల 73 లక్షల రూపాయలు నిలువలు ఉన్నాయని అన్నారు. ఈ నిధులను మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి 28 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయించాల్సిన బాధ్యత కౌన్సిల్ పై ఉందని అన్నారు.

ప్రస్తుత హుజూర్ నగర్ చైర్ పర్సన్, అధికారులు జిల్లా కలెక్టర్ వద్ద ఎమర్జెన్సీ పనుల పేరుతో ఎటువంటి తీర్మానాలు లేకుండా,ఎటువంటి పనులను చేయకుండా ఎం బి రికార్డ్ లేకుండా, నిధులను గత మూడు సంవత్సరాలుగా కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు.

ఇప్పటికైనా ఈ నిధులు దుర్వినియోగం కాకుండా కౌన్సిల్ తీర్మానాన్ని ఏర్పాటు చేసి వార్డు అభివృద్ధి కొరకు నిధులను కేటాయించాల్సిందిగా ప్రతిపక్ష కౌన్సిలర్లుగా ప్రజల తరఫున త్వరలో పోరాటానికి సిద్ధమవుతున్నామని,సోమవారం నుండి కార్యాచరణ మొదలు పెడుతున్నామని తెలియజేశారు.

ఈ పోరాటానికి ప్రజల మద్దతు చాలా అవసరమని,పట్టణ మేధావులు ఆలోచించాలని,ప్రజలు చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రంగారావు హామీతో వినతి పత్రాన్ని అందజేసి నిరసన కార్యక్రమాన్ని విరమించారు.

ఈ కార్యక్రమంలో 23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య,కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంపత్ రెడ్డి,రాజా నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ వెంకటేశ్వర్లు,సరిత వీరారెడ్డి,వేముల వరలక్ష్మి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మహిళా శక్తి అంటే ఏంటో చాటి చెప్పాలి

Murali Krishna

శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment