42.2 C
Hyderabad
May 3, 2024 17: 22 PM
Slider విజయనగరం

ప‌ట్టుకున్న విలువ త‌క్కువే..కానీ సినీ ఫ‌క్కీలో కేస్ ను ట్రేస్ చేసిన ఎస్ఐలు…!

#VijayanagaramPolice

ఓ చిన్న ఆధారంతో సినీ ఫ‌క్కీలో ఛేజ్ చేసారు…మ‌న పోలీసులు, పొయిన స‌రుకు విలువ చాలా త‌క్కువ అయిన‌ప్ప‌టికీ…అధునాత సాంకేతిక ప‌రిజ్ఙానం వినియోగించి మరీ…అర్ధ‌రాత్రి  అటు గ‌వ‌ర్న‌మెంట్ రైల్వే  పోలీసులు, ఇటు గ‌జ‌ప‌తిన‌గ‌రం,బొబ్బిలి పోలీసుల స‌హాయంతో ఎట్టకేల‌కు నిందితుల‌ను ప‌ట్టుకుని…70 వేలు విలువ చేసే లారీ టైర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పోలీసులు.

అదీ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ప్ర‌స్తుతం ఉన్న డిజిట‌ల్ టెక్నాల‌జీ, గ‌వ‌ర్న‌మెంట్ రైల్వే పోలీసులు,రైల్వే ప్రొటెక్ష‌న్ పోలీసులతో సహాయంతో నిందితులు జిల్లా దాటి వెళ్లిపోతుండ‌గానే ప‌ట్టుకున్నారు.

జీపీఎస్, వాట్సాప్, స‌హాయంతో స‌రుకును తీసుకెళుతున్న నిందితుల‌ను సినీ ప‌క్కీలో అర్ద‌రాత్రి చేజ్ చేసి మ‌రీ ప‌ట్టుకున్నారు..విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ ఎస్ఐలు నారాయ‌ణ‌, ల‌క్ష్మీ ప్ర‌సన్న‌కుమార్ లు. అచ్చం సింగం-2 లో హీరో సూర్య ఛేజ్ చేసే విధంగా దాదాపు మూడుగంట‌ల‌కు పైగా గాలింపులు చేసి మ‌రీ ఇద్ద‌రు నిందితుల‌ను  పోలీసులు ప‌ట్టుకున్నారు.

ఏపీలోని విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజ‌న్ ఆఫీసులో డీఎస్పీ అనిల్ మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ  విలువ త‌క్కువ అయినా సినీ ఫ‌క్కీలో త‌మ సిబ్బంది మ‌ధ్య ప్ర‌దేశ్ చెందిన నిందితుల‌ను ప‌ట్టుకున్నార‌న్నారు.ఈ నెల 21 న అర్ధ‌రాత్రి విశాఖ గంగ‌వ‌రం పోర్ట్ నుంచీ బొగ్గు స‌రుకును ఛ‌త్తీస్ ఘ‌డ్  కు త‌ర‌లిస్తుండ‌గా విజ‌య‌న‌గ‌రం స‌మీపం చెల్లూరు వ‌ద్ద 14 టైర్లు ఉన్న లారీని ఆపి.70 వేలు విలువ చేసే 4 టైర్ల‌ను ..నిందితులైన సాహు, సిద్దిలు అప‌హ‌రించారు.

వెంట‌నే లారీ ఓన‌ర్ త‌స్వీర్ సింగ్ విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆ రోజు రాత్రే సీఐ మంగ‌వేణి ఆదేశాల‌తో ఎస్ఐలు నారాయ‌ణ‌రావు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్నలు..ఫిర్యాదు దారుడు ఇచ్చిన స‌మాచారంతో పాటు లారీలో అమ‌ర్చిన జీపీఎస్ ద్వారా నిందితులు .రైలులో గ‌జ‌పతిన‌గ‌రం వెళ్లిన‌ట్టు గుర్తించారు.

తక్ష‌ణం..విజ‌య‌న‌గ‌రం గ‌వర్న‌మెంట్ రైల్వే పోలీసుల స‌హాయంతో నిందితులు బొబ్బిలిలో ఉన్న‌ట్టు తెలుసుకుని అక్క‌డి స్థానిక పోలీసులను అలెర్ట్ చేసారు.

దీంతో బొబ్బిలి సీఐలు కేశ‌వ్,శోభ‌న్ బాబులు త‌మ స్టేష‌న్ ఎస్ఐలు స‌హాకారంతో నిందితుల‌ను స‌మాచారం సేక‌రించి..విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పోలీసులకు ఇచ్చారు. దీంతో పోలీసులు.70 వేలు విలువ చేసే టైర్ల‌తో పాటు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.

ఈ మీడియా స‌మావేశంలో సీఐ మంగ‌వేణి,ఎస్ఐలు నారాయాణ‌, ల‌క్ష్మీప్ర‌స‌న్న‌లు ఉండ‌గా  ఈ నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో మ‌రో ఎస్ఐ త్రినాథ‌రావు, హెచ్.సీ ష‌ఫీలు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

Related posts

బర్రెలక్క గెలుపుకు పట్టం కట్టండి

Satyam NEWS

పిడిఎస్ యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా ఆజాద్

Murali Krishna

ఎర్రచందనం స్మగ్లర్ల కోసం అడవిలో సెర్చ్ ఆపరేషన్

Bhavani

Leave a Comment