30.7 C
Hyderabad
April 29, 2024 04: 31 AM
Slider నల్గొండ

సిపి ఐ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

#CPINalgonda

డిసెంబర్ 26 న జరిగేభారత కమ్యూనిస్టు పార్టీ 95వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని నియోజకవర్గ  ఇంచార్జి లోడింగ్ శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం నాడు సిపిఐ గుండ్రంపల్లి శాఖ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి హాజరై శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ 95 సంవత్సరాలుగా పార్టీ పేద ప్రజల పక్షాన సామాజిక న్యాయం కోసం, సమసమాజ ఏర్పాటుకు, దోపిడీ లేని  వ్యవస్థ ఏర్పాటు కోసం వేలాది మంది అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పోరాడుతుందని  అన్నారు.

ఎన్నికల ముందు నరేంద్ర మోడీ స్వదేశీ విధానంతో అధికారంలోకి వచ్చి దేశాన్ని సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, ఐఓసీ, రైల్వే,, నౌకాయాన, విమానయాన, గ్యాస్ నిక్షేపాలను వేలం వేస్తుందని ఆయన విమర్శించారు.

కరోనా పరిస్థితుల్లో ప్రజలపై గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజలపై అనేక పన్నులు వేస్తూ సెంటిమెంటుతో పరిపాలన కొనసాగించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతాంగం తో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించ లేవని ఆయన విమర్శించారు.

సిపిఐ మండల కార్యదర్శి సి.ఎం.డి అక్బర్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, చెరువు కుండలను అక్రమార్కులు కబ్జాలు చేస్తున్నప్పటికీ జిల్లా మండల రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

మండలంలో పర్మిషన్ లు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గీత పని వారల సంఘం జిల్లా అధ్యక్షుడు బొడిగా సైదులు, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి  జిల్లా యాదయ్య, శాఖ కార్యదర్శి ఇ జిల్లా సత్యం,

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కాసర్ల రాజు, రైతు సంఘం నాయకులు బొబ్బలశంకర్ రెడ్డి, నరేష్, చిన్న మల్లయ్య, అశోక్  , రాజు , గరిసా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

సోలిసిటర్ జనరల్ లేఖల తర్వాతే సుప్రీం నిర్ణయం

Satyam NEWS

పాత్రికేయులే కరోనాపై అపోహలు తొలగించాలి

Satyam NEWS

అవాంఛనీయ వ్యాఖ్యలతో రెచ్చగొట్టే రాజకీయం

Satyam NEWS

Leave a Comment