40.2 C
Hyderabad
May 2, 2024 16: 00 PM
Slider విజయనగరం

ప‌ని చేసిన కంపెనీలో దొంగ‌త‌నం..ఏడాది నుంచీ జ‌రుగుతున్న చోరీ

#Vijayanagaram Police

విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురం మండలం, ముక్కాం లో ఉన్న వైశాఖిబయో రిసోర్సెస్ కంపెనీలో సుమారు 6లక్షలు విలువ చేసే స్ట్రంప్ ఫీడ్ (రొయ్యిల ఆహారం) టీలు దొంగిలించడిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయ‌డంతో పాటు  వారి వ‌ద్ద నుంచీ 4 ల‌క్ష‌ల‌ 47,800/- నగదు, 5 సెల్ ఫోన్లు, 3 ప్రింప్ ఫీడ్ టిన్లను స్వాధీనం చేసుకున్నారు..పోలీసులు.

ఈమేర‌కు న‌గ‌రంలోని గూడ్స్ షెడ్ వ‌ద్ద స‌బ్ డివిజ‌న్ కార్యాల‌యంలో  ఏర్పాటు చేసి మీడియా స‌మావేశంలో డీఎస్పీ అనిల్, బోగాపురం సీఐ శ్రీధ‌ర్,ఎస్ఐ మ‌హేష్ లు మాట్లాడారు.. వివరాల్లోకి వెళ్లితే.. భోగాపురం మండలం, ముక్కాం గ్రామం దగ్గరలో రొయ్యిల ఆహారం తయారు చేసే వైశాఖి బయో రిసోర్సెస్ కంపెనీలో రొయ్యిల ఫీడ్ టిన్లు దొంతనం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం భోగాపురం పోలీసుల‌కు గ‌త నెల‌ 28న ఫిర్యాదు చేశారు.

దీంతో భోగాపురం ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసి, సీఐ శ్రీధర్ ప‌ర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేశారు. వైశాఖి బయో రిసోర్సెస్ కంపెనీలో ఉన్న సిసి కెమారాల సహాయంతో సదరు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది అయిన రాము @చిన్నరాము, రాము,  సీల పైడిరాజు,  దేబారికి రాజారావులు దొంగతనం చేసినట్లుగా నిర్ధారించి వారిని అదుపులోనికి తీసుకుని  విచారించారు.

అయితే  వాళ్లు గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచీ  360 టిన్లు రొయ్యిల ఫీడ్  కంపెనీ గోడ పై నుండి బయటికి విసిరిన‌ట్టు ఒప్పుకున్నారు. ఆ  త‌ర్వా  వాటిని మ‌రో ఇద్ద‌రు నిందితులైన‌ కాగితాల రామునాయుడు,  అప్పలరెడ్డిల సహాయంతో కాకినాడలో అమ్మిన‌ట్టు ఒప్పుకొన్నారు.

దొంగిలింపబడిన రొయ్యిల ఫీడ్ విలువ సుమారు  6 లక్షలు  ఉంటుంద‌ని డీఎస్పీ  అనిల్ తెలిపారు. ఇక ఈ ఇంటి దొంగ‌ల‌ను  చాక‌చ‌క్యంగా సీసీ కెమార పుటేజ్ ద్వారా ప‌ట్టుకోవ‌డంలో  భోగాపురం సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో స్టేష‌న్  ఎస్ఐ మహేష్, హెచ్ సి రామనివాస్, కానిస్టేబుళ్ళు నాయుడు, విజయ్, శ్రీనివాస్ లు బాగ‌స్వాములు అయ్యారు.ఈ మేర‌కు సిబ్బందిని డీఎస్పీ అనిల్ అభినందించారు.

Related posts

విద్యార్ధులు సమాజసేవను అలవాటు చేసుకోవాలి

Satyam NEWS

బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి మాయావతి మద్దతు

Satyam NEWS

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment