38.2 C
Hyderabad
April 28, 2024 22: 24 PM
Slider జాతీయం

బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి మాయావతి మద్దతు

#smallmayawati

బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు మద్దతు ప్రకటించారు. బుధవారం ఆమె తన పార్టీ మద్దతు ప్రకటించారు. దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికలు జరిపిన సంగతి తెలిసిందే అని మాయావతి ట్వీట్ చేస్తూ రాశారు.

ఇప్పుడు అదే పరిస్థితి కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఆగస్టు 6న ఎన్నిక జరగనుంది. వైస్ ప్రెసిడెంట్ పదవికి జరిగే ఎన్నికలలో విస్తృత ప్రజా ప్రయోజనాలను, దాని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని BSP కూడా జగదీప్ ధన్‌ఖర్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఈ రోజు నేను కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాను అని ఆమె తెలిపారు.

Related posts

తగ్గిన చికెన్ ధరలు

Bhavani

సస్పెండ్ చేస్తారా? ఎంత మందిని సస్పెండ్ చేస్తారు?

Satyam NEWS

ట్విట్టర్ సీఈవో పదవి నుంచి వైదొలగనున్న ఎలోన్ మస్క్

Bhavani

Leave a Comment